మన సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువ బడ్జెట్ లో సినిమాలు అంటే మలయాళంలోనే వస్తూ ఉంటాయి. పది కోట్ల లోపు బడ్జెట్ తో పూర్తి చేసిన సినిమాలు వంద కోట్ల రూపాయల వసూళ్లు సాధించినవి ఇటీవల మనం చూశాం. అంతేకాదు ధియేటర్ రన్ పూర్తి అయిన తర్వాత ఓటీటీలో కూడా మంచి మంచి వాచ్ అవర్స్ సాధిస్తున్నాయి. అయితే ఇప్పుడు కన్నడ తమిళ పరిశ్రమలో కూడా ఇలాంటి పందా పెరిగింది. ఇక్కడ నుంచి కూడా చాలా చిన్న సినిమాలు సంచలనాలు నమోదు చేస్తున్నాయి. నిర్మాతలకి కాసుల పంట పండిస్తున్నాయి. వందల కోట్ల రూపాయల బడ్జెట్ చిత్రాల కంటే 100 రెట్లు చిన్న సినిమాలు తీయడం మేలని చాలా మంది నిర్మాతలు ఆలోచిస్తున్నారు. ఇటీవల ఓ కన్నడ సినిమా ఇలాంటి సంచలనం నమోదు చేసింది.
సరికొత్త మేజిక్ చేసింది ఈ కన్నడ సినిమా. అదే సు ఫ్రమ్ సో (Su from So). కేవలం 5 కోట్ల రూపాయల బడ్జెట్ తో తీశారు. పెద్దగా ప్రమోషన్ చేయలేదు కాని కంటెంట్ ఉంటే సినిమా ఎవరూ ఆపలేరు అనేది మరోసారి నిరూపించి, వసూళ్ల పరంగా చరిత్ర క్రియేట్ చేసింది ఈ సినిమా.. తుమినాడ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి, రామ్ బి శెట్టి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించారు.ఈ చిత్రంలో ఓ కీలక రోల్ చేశారు.
ధియేటర్ రన్ చాలా వరకూ పూర్తి అయింది. ఇక ఓటీటీ లవర్స్ ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని చూస్తున్నారు. అంతేకాదు ఈ సినిమా టాక్ దేశ వ్యాప్తంగా వచ్చింది. దీంతో ఇది అన్నీ భాషల్లో ఓటీటీలో రావాలి అని కోరుకుంటున్నారు..ఈ ఏడాది జులై 25న దియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. పెద్ద పబ్లిసిటీ లేకపోయినా 60 నుంచి 80 శాతం ఆక్యుపెన్సీ కనిపించింది. పెద్ద సినిమాలకు పోటీ ఇచ్చింది.
కర్ణాటక రాష్ట్రంలో ఈ సినిమా 75 కోట్లు నెట్ వసూలు చేసింది. దీని బట్టి అర్దం చేసుకోవచ్చు ఎంత మేర లాభాలు తీసుకువస్తుంది అనేది. మొత్తం గ్రాస్ వసూళ్లు 115 కోట్ల రూపాయలు తీసుకువచ్చింది. ఇక 2025లో చిన్న సినిమాల రికార్డుల్లో వసూళ్ల పరంగా ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. గుడ్ న్యూస్ ఏమిటి అంటే ఈ సినిమా వచ్చే నెల అంటే సెప్టెంబర్ 5 నుంచి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది అని తెలుస్తోంది. అయితే అఫీషియల్ ప్రకటన రాకపోయినా ఓటీటీ అప్ డేట్స్ లో ఈ వార్త బాగా వినిపిస్తోంది.
కథనం
ఈ సినిమా ఓ మధ్యతరగతి అబ్బాయి లవ్ స్టోరీగా తీశారు. అశోక్ అనే అబ్బాయి ఓ అమ్మాయిని లవ్ చేస్తాడు. ఆమెని కలవడానికి ఊరు వెళతాడు. ఈ సమయంలో అక్కడ వారి నుంచి తప్పించుకునేందుకు తనకు దెయ్యం పట్టింది అని అబద్దం చెబుతాడు. ఇలా చెప్పడం వల్ల అతనికి అనుకోని సమస్యలు వస్తాయి. అక్కడ నుంచి సినిమా ట్విస్టులతో ఆసక్తిగా ఉంటుంది. కామెడీ, ప్రేమ, డ్రామా అన్నీ ఇందులో మిక్స్ చేశారు.
కంటెంట్ మీద దృష్టి పెట్టి, సరైన కథనంతో మంచి నటులని తీసుకుంటే కచ్చితంగా సూపర్ హిట్లు కొట్టవచ్చు అని నిరూపించింది ఈ సు ఫ్రమ్ సో సినిమా.
మరి చూడాలి ఓటీటీలో ఎప్పుడు వస్తుందో. అన్నీ భాషల్లో రావాలి అని మూవీ లవర్స్ కోరుకుంటున్నారు.