హీరో నారా రోహిత్ గతంలో చాలా వేగంగా సినిమాలు చేసేవారు, అయితే ప్రస్తుతం విభిన్నమైన స్టోరీలు ఎంచుకుంటూ నెమ్మదిగానే సినిమాలు చేస్తున్నారు.. నారా రోహిత్ తో సినిమా అంటే నిర్మాతకు ఢోకా ఉండదు అంటారు.. రోహిత్ సినిమాలకి మీడియం రేంజ్ హీరోల్లో మంచి కలెక్షన్స్ వస్తాయి. తాజాగా ప్రతినిధి 2, భైరవం సినిమాలతో సందడి చేసిన ఆయన, ఈ వినాయక చవితికి కొత్త దర్శకుడు వెంకటేశ్ నిమ్మలపూడి దర్శకత్వంలో సుందరకాండ అనే సినిమాతో అలరించేందుకు మన ముందుకు వచ్చారు.. మరి ఈ సినిమా ఏ విధంగా ఉంది ఆడియన్స్ పల్స్ రివ్యూలో చూద్దాం.
కాస్టింగ్ –నారా రోహిత్, శ్రీదేవి విజయ్ కుమార్, వ్రితి వాఘని,
నరేష్, వాసుకి ఆనంద్, సత్య, అభినవ్ గోమటం
దర్శకుడు — వెంకటేశ్ నిమ్మలపూడి
సంగీతం– లియోన్ జేమ్స్
సినిమాటోగ్రాఫర్–ప్రదీష్ ఎం వర్మ
ఎడిటర్– రోహన్ చిల్లాలే
ఆర్ట్ –రాజేశ్ పెంటకోట
బ్యానర్– సందీప్ పిక్చర్ ప్యాలెస్
నిర్మాతలు– సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళీ
కథ
సిద్ధార్థ్ నారా రోహిత్ తనకి కాబోయే భార్యకి కావాల్సిన ఐదు లక్షణాలు లేవని తనకి వచ్చిన పెళ్లి సంబంధాలు అన్నీ రిజెక్ట్ చేస్తూ వస్తాడు. చివరకు ఎవరిని పెళ్లి చేసుకుంటాడా అని అందరి ఆలోచన, అయితే తనస్కూల్లో ప్రేమించిన
వైష్ణవి శ్రీదేవి తనకు దూరం అవుతుంది. ఆ తర్వాత ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నా ఈ ఐదు లక్షణాలు ఉండాల్సిందే అని కండిషన్ పెడతాడు.
ఓ పక్క వయసు ముదిరిపోతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో అతనికి ఐరా కనిపిస్తుంది.. తను కోరుకున్న లక్షణాలు ఆమెలో ఉన్నాయని గుర్తిస్తాడు ..అయితే ఇద్దరికి ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉంటుంది.. అయినా తన ప్రపోజల్ పెడతాడు.. అయితే తను చిన్నప్పుడు ప్రేమించిన వైష్ణవి -ఐరా కి బంధువు అవుతుంది. ఈ విషయం అతనికి తెలిసి షాక్ అవుతాడు, అక్కడ నుంచి కథ టర్న్ అవుతుంది. చివరకు సిద్దార్ద్ ఐరా ప్రేమ సక్సస్ అయిందా, వైష్ణవిని ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది.. ఈ విషయాలు తెలియాలంటే వెండితెరపై ఈ సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
ఈ స్టోరీ విషయంలో టేకింగ్ లో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు దర్శకుడు, ముఖ్యంగా రెండు సెంటిమెంట్ లవ్ ట్రాక్ లు బ్యాలెన్స్ చేసిన విధానం చాలా బాగుంది.. ముఖ్యంగా నారా రోహిత్ చాలా అద్బుతంగా నటించాడు.
లవ్ ఓరియెంటెడ్ సినిమాల కథలు ఒకే లైన్ అనుకుంటాం, కానీ ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్..
ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాలోని చాలా సన్నివేశాలు రాసుకున్నాడు. ఇక ఫస్టాఫ్ చాలా సరదాగా సాగింది, సెకండాఫ్ అసలైన చాప్టర్ మొదలైంది… ఇంటర్వెల్ ట్విస్ట్ చాలా బాగుంది..
సత్య కామెడి బాగా వర్కౌట్ అయింది, ఎప్పటిలాగా తనే తెర పై నవ్వులు పూయించాడు.
సీనియర్ నటి శ్రీదేవి మంచి రోల్ చేశారు, ఇక హీరోయిన్ వ్రితి వాఘని మంచి పాత్ర చేసింది. సీనియర్ నరేష్ పాత్ర చిన్నది అయినా ఉన్నంత సేపు నవ్వించారు .. దర్శకుడు పూర్తిగా ఎంటర్టైన్మెంట్ యాంగిల్ లో చెప్పే ప్రయత్నం చేశారు అనే చెప్పాలి.
టెక్నికల్ పరంగా
ఈ చిత్రానికి ఖర్చు బాగానే చేశారు, చాలా రిచ్ లుక్ ఉంది, అంతేకాదు నిర్మాణ విలువలు బాగున్నాయి, టేకింగ్ అద్బుతం ముఖ్యంగా డీవోపీ చాలా బాగుంది.. ప్రదీష్ వర్మ కెమెరా వర్క్ చాలా బాగుంది. లియోన్ జేమ్స్ సంగీతం మాత్రం ఈ సినిమాకి పెద్ద అసెట్ గా నిలిచింది.. రెండు పాటలు బాగా అలరించాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ సెకండాఫ్ ని నిలబెట్టింది.. ఎడిటింగ్ విషయంలో ఇంకొంచెం ఎక్స్ పెక్ట్ చేయవచ్చు .. ఫైనల్ గా కెప్టెన్ దర్శకుడు
వెంకటేష్ నిమ్మలపూడి ఈ సినిమాని తీసిన విధానం బాగుంది. తొలి ప్రయత్నం కచ్చితంగా మెచ్చుకునేలా ఉంది
అనే చెప్పాలి.
ట్యాగ్
వినాయకచవితికి సుందరకాండ ఓ మంచి ఫీల్ గుడ్ మూవీ