సూర్య తన 46వ సినిమా కోసం మొదటిసారి తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరితో చేతులు కలపడం ఇప్పుడు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ అయింది. ఇది రెండు భాషల్లో రూపొందుతున్న ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్.
అయితే ఈ సినిమా గురించి వస్తున్న ఒక క్రేజీ రూమర్ ఏంటంటే, ఇందులో దుల్కర్ సల్మాన్ ఒక కీలకమైన క్యామియో రోల్లో కనిపించబోతున్నారట. ఆల్రెడీ వెంకీ అట్లూరితో దుల్కర్ ‘లక్కీ బాస్కర్’ సినిమా చేసి ఉండటంతో, ఈ వార్త నిజమయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని అందరూ అనుకుంటున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగా జరుగుతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో ‘ప్రేమలు’ ఫేమ్ మమిత బైజు హీరోయిన్గా నటిస్తోంది.
మేకర్స్ ఈ సినిమాను వచ్చే వేసవిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా, ఈ సినిమా పూర్తయిన తర్వాత వెంకీ అట్లూరి మళ్ళీ దుల్కర్‌తో కలిసి ‘లక్కీ బాస్కర్’ సీక్వెల్ చేసే ఛాన్స్ కూడా ఉందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది.
సూర్య-వెంకీ అట్లూరి కాంబినేషనే ఇంట్రెస్టింగ్గా ఉందనుకుంటే, ఇప్పుడు దుల్కర్ పేరు కూడా తోడవడంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.