పాపులేషన్ పరంగా, విస్తీర్ణం పరంగా ఒక పెద్ద దేశం చైనా. ఒక విచిత్రమైన సమస్యతో బాధపడుతుంది. 1993 నుంచి అక్కడ ఒక విషయం మార్చకుండా కొనసాగుతుంది. అదేమిటంటే కండోమ్లో,గర్భనిరోధక మాత్రలు ఏదీ కూడా పన్ను లేకుండా అమ్మేవారు 30 ఏళ్లుగా ఇదే పరిస్థితి.
కానీ 2026 జనవరి నుంచి చైనా ప్రభుత్వం ఒక కఠినమైన నిర్ణయం తీసుకొంటుంది. అదేమిటంటే ఎవరైనా కండోమ్ లు గాని గర్భనిరోధక మాత్రలు కొనాలంటే 13% VAT చెల్లించాలసి ఉంటుంది. ఇది మూడు దశాబ్దాల తర్వాత ఈ మార్పు జరుగుతుంది.
దీనికి గల కారణం ఏమిటంటే అక్కడ పిల్లలు అనేది చాలా తక్కువ మంది పుడుతున్నారు.
చైనా ఎందుకిలా చేసింది అంటే, చైనాకు ఒక విచిత్రమైన తీవ్రమైన సమస్యతో బాధపడుతుంది. జనాభా పెరుగుదల అనేది చాలా వేగంగా తగ్గిపోతుంది. ఈ జనాభా పెరుగుదల అనేది తగ్గిపోవడం వల్ల ఆర్థిక వ్యవస్థ అన్నది ప్రమాదంలో పడే ఛాన్స్ ఉంది.
2016లో చైనాలో పుట్టిన పిల్లలు 18.8 మిలియన్స్, అయితే 2024 లో పుట్టిన పిల్లలు 9.54 మిలియన్స్ మాత్రమే అంటే ఇక్కడే మీకు అర్థమవుతుంది. ఏ విధంగా పిల్లల జనాభా అనేది తగ్గుతుందో అని అందుకని దీన్ని దృష్టిలో ఉంచుకొని చైనా ప్రభుత్వం జనవరి 2026 నుంచి ఈ 13% VAT విధించడం జరుగుతుంది. దీని ద్వారా అన్న పిల్లల జననాలు పెంచవచ్చు అని చైనా భావిస్తుంది.