వ్యాపారంలో ఎప్పుడు ఎవరి లైఫ్ ఎలా టర్న్ అవుతుందో ఎవరూ చెప్పలేము. కొంతమందికి వ్యాపారంలో లక్ కూడా బాగా కలిసి వస్తుంది. వారు అందులో అద్బుతంగా రాణిస్తారు. బతకడానికి ఎన్నో మార్గాలు వ్యాపారానికి కూడా ఎన్నో అవకాశాలు మార్గాలు ఉన్నాయి. వ్యాపారంలో సక్సస్ అవ్వాలంటే మన కృషి పట్టుదల కూడా ఉండాలి. అన్నీ దగ్గరుండి చూసుకుంటూ ప్రణాళికతో ముందుకు వెళితే సక్సస్ మన తలుపు తడుతుంది. దాదాపు 10 సంవత్సరాలుగా మన దేశంలో టీ అవుట్ లెట్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. చాలా చోట్ల టీ ఫ్రాంచైజీలు ఇస్తున్నారు.
కాఫీ పలు రకాల టీప్లేవర్స్ అందిస్తున్న సంస్దలు మన దేశంలో ఒక 100 వరకూ ఉన్నాయి. పది రూపాయల టీ అని అనుకుంటాం కాని సంవత్సరానికి ఫ్రాంచైజీల టర్నోవర్ 10 వేల కోట్ల పైనే ఉంది. తాజాగా ఇలాంటి ఓ బిజినెస్ లో 50,000 పెట్టుబడితో కోట్ల రూపాయల టర్నోవర్ సాధించిన యువకుడి గురించి అతని విజయ రహస్యం గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం.. కేవలం 50 వేల రూపాయల పెట్టుబడితో ఓ టీకొట్టును ప్రారంభించి ఇప్పుడు ఏకంగా 7 కోట్ల రుపాయల టర్నోవర్ చేస్తున్నాడు.
ప్రతీ రోజు దాదాపు మన దేశంలో సగం మంది టీ తాగకుండా ఉండలేరు. టీ తాగకపోతే మన డైలీ రోటిన్ లైఫ్ నడవదు. టీ లేదా కాఫీ తాగడం మనకు జీవితంలో భాగం అయింది.. కార్పొరేట్ కంపెనీలు కూడా టీ కాఫీ దుకాణాలు నడుపుతున్నాయి. అయితే ధర కూడా అక్కడ ఎక్కువ ఉంటుంది. మిడిల్ క్లాస్ సాధారణ వ్యక్తులు కూడా తాగేలా పది లేదా 20 రూపాయలకు చాయ్ అందించే ఫ్రాంచైజీలు దుకాణాలు ఇప్పుడు చాలా వెలిశాయి.
ఇలాంటి వేళ ఈ టీ వ్యాపారంలో సక్సస్ సాధించిన ఓ వ్యక్తి గురించి తెలుసుకుందాం.
తమిళనాడులోని ఒక చిన్న గ్రామంలో జన్మించిన జోసెఫ్ రాజేష్ అనే వ్యక్తి చెన్నైలో ఒక ప్రసిద్ధ టీ బ్రాండ్‌ను సృష్టించాడు. జోసెఫ్ రాజేష్ కరూర్ జిల్లాలోని మోచకోట్టం పాలయం అనే చిన్న గ్రామంలో పుట్టి పెరిగాడు.
చిన్నతనం నుంచి తాను ఏదైనా సాధించాలని వ్యాపారంలో ఎదగాలని కోరిక ఉండేది. బాగా చదువుకుని కొద్దికాలం బ్యాంకులో ఉద్యోగం చేశాడు. కానీ అతని కోరిక మాత్రం మనసుని మెలిపెడుతోంది. చివరకు ఆదాయం సరిపోకపోవడంలో ఏదైనా తెగించి వ్యాపారం చేయాలి అని అనుకున్నాడు.
2017లోచెన్నైలో రూ. 50,000 పెట్టుబడితో బ్లాక్ పెకోయ్ అనే టీ అవుట్ లెట్ స్టార్ట్ చేశాడు.
వేలచేరిలోని గ్రాండ్ మాల్‌లో కేవలం 100 చదరపు అడుగుల స్థలంలో బ్లాక్ పెకో అనే టీ దుకాణాన్ని ప్రారంభించాడు. చాలా బాగా క్లిక్ అయింది మార్కెట్లో అతని టీ టేస్ట్ బాగుంది అని పేరు వచ్చింది. నిత్యం టీ దుకాణం జనంతో కిక్కిరిసి ఉండేది. రుచికరమైన స్నాక్ ఐటమ్స్ కస్టమర్లను బాగా ఆకట్టుకున్నాయి. రోజు అప్పట్లో 10 వేలు అమ్మేవాడు మంచి లాభాలు చూశాడు .. తర్వాత చెన్నైలోని అలందూర్‌లో రూ.20,00,000 పెట్టుబడితో బ్లాక్ పెకో అవుట్ లెట్ చాలా భారీగా పెట్టాడు కానీ అక్కడ పార్కింగ్ లేకపోవడం మైనస్ అయింది. లాస్ వచ్చి ఆరు నెలల్లో తీసేశారు.
తర్వాత రామానుజన్ సిటీ, OMRలో 3 లక్షల చిన్న పెట్టుబడితో అవుట్ లెట్ స్టార్ట్ చేశాడు అక్కడ సక్సస్ అయ్యాడు. అక్కడ నుంచి ప్రాంచైజీలు ఇవ్వడం మొదలు పెట్టి ఇక వ్యాపారంలో తిరిగి చూసుకోలేదు.
తమిళనాడులో 78 టీ దుకాణాలతో బ్రాండ్‌గా ఎదిగింది అతను స్టార్ట్ చేసిని బ్లాక్ పెకో అనే కంపెనీ .. బిగ్ బిలియన్ ఫుడ్ అండ్ బెవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీగా దానిని మార్చాడు. తమిళనాడుతో పాటు ఇతర ప్రాంతాలకు
ఫ్రాంచైజీలు ఇస్తున్నాడు దాదాపు ఏడాదికి 7 కోట్ల లాభాన్ని ఆర్జిస్తోంది ఆ కంపెనీ
అనేక రకాల టీ ప్లేవర్లు , ఫిల్టిర్ కాఫీ, కాఫీ అలాగే పలు రకాల స్నాక్స్ చాక్లెట్స్ ఇలా అనేక రకాలు కూడా అక్కడ అమ్ముతున్నారు.. ఈ ప్లేవర్స్ నచ్చడంతో ఎక్కడ టీ అవుట్ లెట్ ఇచ్చినా మంచి పేరుతో రన్ అవుతోంది. అన్నీ చోట్లా లాభాలే వస్తున్నాయి, ఇప్పటి వరకూ ప్రారంభించిన వాటిలో ఏ ఒక్కటి కూడా క్లోజ్ అవ్వలేదు.. ఇక ఎవరైనా మహిళలు ఈ అవుట్ లెట్ స్టార్ట్ చేస్తే వారిని ప్రొత్సహించేందుకు ప్రత్యేక డిస్కౌంట్లు ఇచ్చాడు. ఒంటరి మహిళలు భర్తలేని చాలా మంది ఈ వ్యాపారం ప్రారంభించి వారి కాళ్లపై వారు నిలబడేలా చేశాడు.
ఇప్పటివరకు 13 మంది మహిళలు అతని నుండి ఫ్రాంచైజీలు తీసుకొని నెలకు రూ. 5 లక్షల వరకు సంపాదిస్తున్నారు.
జోసెఫ్ మాట్లాడుతూ తాను ఒక్కడినే దీనిని స్టార్ట్ చేశా, ఇప్పుడు నా దగ్గర వందల మంది వర్క్ చేస్తున్నారు ఇదంతా కస్టమర్లు నా పై చూపించిన అభిమానం, ఆ దేవుడి కరుణ అంటాడు.
50 వేల పెట్టుబడితో టీ షాపు పెట్టాడు – ఇప్పుడు కోట్ల టర్నోవర్