పెట్రోల్ డీజీల్ కార్ల వాడకం దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా బాగా తగ్గుతోంది. ప్రతీ ఏడాది ఈవీ వెహికల్స్ సేల్స్ పెరగడం ఒక సూచనగా కూడా కనిపిస్తోంది. మార్కెట్ లో ఈవీ వెహికల్స్ ఇప్పుడు మన దేశంలో
దాదాపు 25 శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తుంది. వీటి వాడకంతో కాలుష్యం కూడా బాగా తగ్గుతోంది. రానున్న రోజుల్లో ఈవీ మార్కెట్ దేశంలో ఫస్ట్ పొజిషన్ లో ఉంటుంది అనేది తాజా అమ్మకాల ట్రెండ్స్ బట్టీ తెలుస్తోంది. అనేక ఫీచర్లతో కంపెనీలు తయారీకి ముందుకు వస్తున్నాయి. ఇక ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఇప్పటికే అప్ గ్రేడ్ అవుతూ ఈవీ వెహికల్స్ తయారీకి సాంప్రదాయ కంపెనీలు సిద్దం అయ్యాయి. పెట్రో డీజీల్ వెహికల్ తో పాటు ఈవీ వెహికల్ మోడల్స్ ని దింపుతున్నాయి.
అయితే ప్రపంచ వ్యాప్తంగా టెస్లా ఇందులో ఓ సంచలనం అనే చెప్పుకోవాలి, అత్యంత ఖరీదైన మోర్ ఫీచర్లతో ఈవీలని తీసుకువచ్చారు మస్క్. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో ఈవీల వాడకం 2024 నుంచి క్రమంగా పెరిగింది. ఇప్పటికీ అదే జోరు కనిపిస్తోంది.. మన దేశీయ కంపెనీలు అయిన టాటా, మహీంద్రా మొదలైనవి ఇప్పటికే తమ ఫోకస్‌ను ఎలక్ట్రిక్ వాహనాలపైకి మళ్లించాయి. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ఈవీ కంపెనీలు కూడా భారత మార్కెట్‌లోకి వస్తున్నాయి ఇక్కడ కంపెనీలకి గట్టి పోటీ ఇస్తున్నాయి. ఇందులో టెస్లా ప్రముఖంగా ఉంది.
ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ ఇప్పుడు భారత మార్కెట్‌పై దృష్టి పెట్టారు, ఎందుకంటే భారత్ లో ఆయన టెస్లా కంపెనీ కార్లు కచ్చితంగా భారీగా సక్సస్ అవుతాయి అని ఆశలు పెట్టుకున్నారు. ఇక్కడ సక్సస్ అయితే ఆసియా మార్కెట్లో ఫస్ట్ ప్లేస్ లో ఉండవచ్చు అని మస్క్ ఆలోచన. ఇప్పటికే సేల్స్ మార్కెటింగ్ టీమ్ తో ప్రణాళికలు వేస్తున్నారు.
ఈ ఏడాది జూలై మధ్యలో భారతదేశంలో అధికారికంగా అమ్మకాలు ప్రారంభించింది టెస్లా. అనుకున్నంత రెస్పాన్స్ అయితే సాధించలేదు అనే టాక్ వినిపిస్తోంది. కేవలం భారత్ లో 600 ఆర్డర్లు మాత్రమే తీసుకుంది అని టాక్ . కంపెనీ అమ్మకాలపై ఎన్నో హోప్స్ పెట్టుకుంది. కాని దానికి సగం కూడా రీచ్ అవ్వలేదు అని ఆటోమోబైల్ అనలిస్టులు మాట్లడుకుంటున్నారు.
ఇప్పటికే ఆర్డర్లో భాగంగా 500 కార్లను చైనాలో ఉన్న షాంఘై ఫ్యాక్టరీ నుండి ఇండియాకు పంపుతున్నారు, ఇవి ముందుగా బుక్ చేసుకున్న ప్రాంతాలకు డెలివరీ అందిస్తారు. దేశంలో ప్రముఖ నగరాలైన ముంబై, ఢిల్లీ, పూణే, గురుగ్రామ్ కి 300 ఆర్డర్లు రానున్నాయి.. అయితే ఇక్కడ ఇంత సక్సస్ అవ్వడానికి ఆర్డర్లు రావడానికి ఈ ప్రాంతాల్లో చార్జింగ్ కి ఈజీ యాక్సెస్ ఉంది. అలాగే మౌలిక సదుపాయాలు, ఛార్జింగ్ స్టేషన్లు కొన్ని అందుబాటులో ఉన్నాయి. అందుకే ఇక్కడ బుకింగ్స్ జరిగాయి.
ఇప్పటికే ఈ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా గంటకి 150 కార్లని అమ్ముతోంది. ఇక్కడ ఆశ్యర్యకరమైన విషయం భారత్ లో బాగా బుకింగ్స్ వస్తాయి అని అనుకుంటే, భారత్ లో నెల అయినా సరే 600 ఆర్డర్లు రాలేదు . మార్కెటింగ్ టీమ్ దీనిపై దృష్టి పెట్టింది. అయితే మన దేశంలో టెస్లా సక్సస్ అవ్వాలి అంటే ముందు ఆ ధరలు అందుబాటులో ఉండాలి. అలాగే చార్జింగ్ సర్వీస్ పూర్తిగా అన్నీచోట్లా అందుబాటులో రావాలి, ఇలా అయితే కచ్చితంగా అనుకున్న సేల్ రీచ్ అవుతుంది అంటున్నారు.
- కొన్ని టెస్లా కంపెనీ కార్ల ధరలు చూస్తే*
టెస్లా మోడల్ Y ఎలక్ట్రిక్ SUV
మోడల్ Y స్టాండర్డ్ RWD వేరియంట్ 59.89 లక్షలుగా ఉంది
లాంగ్ రేంజ్ RWD వేరియంట్ రూ. 67.89 లక్షలుగా ఉంది
మన దేశంలో టెస్లా కారు కొనడానికి ఇంత ధర పెట్టేందుకు చాలా మంది ఆలోచిస్తున్నారు.
మోడల్ Y 500 కి.మీ నుండి గరిష్టంగా 622 కి.మీ వరకూ పూర్తి చార్జ్ తో వెళ్లవచ్చు.