‘తలైవర్ 173’ డైరెక్టర్ ఎవరనే విషయంపై గత కొన్ని రోజులుగా నడుస్తున్న సస్పెన్స్‌కి ఫైనల్‌గా తెరపడింది. అయితే ఈ రోజు వచ్చిన అఫీషియల్ అప్‌డేట్ మాత్రం అందరినీ ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది. శివకార్తికేయన్‌తో ‘డాన్’ సినిమా తీసిన సిబి చక్రవర్తి ఇప్పుడు మన సూపర్‌స్టార్ రజినీకాంత్ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారు.
నిజానికి ఈ రేసులో వివేక్ ఆత్రేయ, అశ్వత్ మారిముత్తు లాంటి చాలా మంది డైరెక్టర్ల పేర్లు వినిపించాయి కానీ, ఎవరూ ఊహించని విధంగా మేకర్స్ సిబి చక్రవర్తి పేరును ఖరారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఇక ఈ సినిమాకు ఉన్న మరో పెద్ద హైలైట్ ఏంటంటే, దీన్ని కమల్ హాసన్ తన సొంత బ్యానర్ ‘రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్’పై నిర్మిస్తున్నారు.
రజినీకాంత్-కమల్ హాసన్ కాంబినేషన్ అనగానే ఫ్యాన్స్‌లో అప్పుడే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఎవరూ ఊహించని డైరెక్టర్‌తో తలైవర్ చేస్తున్న ఈ ప్రయోగం ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.