భారతదేశంలో టిక్ టాక్ యాప్ కి అప్పట్లో ఎంత క్రేజ్ ఉండేదో చెప్కక్కర్లేదు. చాలా మంది రీల్స్ తో వైరల్ అయ్యారు. అంతేకాదు సినిమా స్టార్లు సెలబ్రెటీలు అయిన వారు ఉన్నారు. సోషల్ మీడియాలో ఇది ఓ ప్రభంజనం క్రియేట్ చేసింది. వాట్సాప్ ఫేస్ బుక్ కంటేఎక్కువ సమయం టిక్ టాక్ లో ఉండేవారు జనం. ఇక టిక్ టాక్ బ్యాన్ అయిన తర్వాత ఇన్ స్టాగ్రామ్ ఇప్పుడు మరింత క్రేజ్ సంపాదించుకుంది. రీల్స్ లో ఇన్ స్టా నెంబర్ వన్ స్ధానంలో ఉంది. ఐదేళ్ల క్రితం టిక్‌టాక్ ని భారత్ నిషేదించింది, ఈ చైనా యాప్ కథ అప్పటితో ముగిసింది, అయితే తాజాగా టెక్ ప్రపంచంలో మళ్లీ భారత్ లో తిరిగి టిక్ టాక్ రానుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.
2020 వరకు భారతదేశంలో నంబర్ వన్ షార్ట్ వీడియో ప్లాట్‌ఫామ్‌గా ఉంది టిక్ టాక్, చైనాకు చెందిన టిక్‌టాక్ వెబ్‌సైట్ ఇప్పుడు భారతదేశంలో చాలా చోట్ల తెరవడానికి అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే యాప్ ప్లేస్టోర్ లో అందుబాటులో లేకపోయినా వెబ్ సైట్ కనిపించడం అనేక అనుమానాలు ఆశలకు తావిస్తోంది.
ప్రభుత్వం నుంచి కాని టిక్‌టాక్ సంస్ధ నుంచి కాని మన దేశంలో ఈ యాప్ తిరిగి రానుంది అని ఎటువంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.
సోషల్ మీడియాలో మాత్రం వినియోగదారులు TikTok వెబ్‌సైట్ అందుబాటులో ఉందని అంటున్నారు. అయితే దానిని యాక్సెస్ చేయలేకపోతున్నాము అంటున్నారు. గతంలో ఇది కనిపించేది కాదు, కానీ ఇప్పుడు కనిపించడం వెనుక కారణం ఏమిటి అనేది టెక్ వరల్డ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.. TikTok యాప్ ఇంకా Google Play Store లేదా Apple App Storeలో అందుబాటులో లేదు. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తించాలి, ప్రభుత్వం ఈ టిక్ టాక్ యాప్ మీద విధించిన నిషేదాన్ని ఇంకా తొలగించలేదు. అది తొలగిస్తేనే ఈ యాప్ తిరిగి బారత్ లో కనిపిస్తుంది.
చైనాతో సరిహద్దులో ఉద్రిక్తత కారణంగా,5 సంవత్సరాల క్రితం భారత ప్రభుత్వం TikTokతో సహా అనేక చైనీస్ యాప్‌లను నిషేధించింది. ఆ సమయంలో, ఈ యాప్‌లు భారతదేశ భద్రతకు చట్టాలకు ముప్పుగా మారతాయి అని వెంటనే బ్లాక్ చేశారు. సెక్యూరిటీ రీజన్స్ లో జాతీయ భద్రతకు ముప్పు ఉంది అని అమెరికాలో కూడా దీనిని నిషేదించారు. అమెరికన్లకు దీనిని అమ్మితే వారు ఈ టిక్ టాక్ ఆపరేషన్లు అమెరికాలో నిర్వహించవచ్చు అని ట్రంప్ తెలిపారు. కానీ ఇది జరగలేదు అక్కడ కూడా యాప్ నిలిచిపోయింది.
అయితే కొందరు ప్రభుత్వ ఉన్నతాధికారులు చెప్పేదాని ప్రకారం, టిక్ టాక్ యాప్ పై ఎలాంటి నిర్ణయం భారత్ తీసుకోలేదని బయట జరుగుతున్న ప్రచారం కూడా వాస్తవం కాదు అని తెలియచేస్తున్నారు.టిక్‌టాక్ తిరిగి రావాలి అని ఆనాటి యూజర్లు కోరుకుంటున్నారు. కానీ ప్రస్తుతం ఈ కంటెంట్ క్రియేట్ చేసే వారి సంఖ్య కూడా బాగా పెరిగింది. ఇప్పటికే ఇన్ స్టాగ్రామ్ టిక్ టాక్ ప్లేస్ ని రీ ప్లేస్ చేసింది అనే చెప్పాలి.
చిన్న వీడియోల ఫార్మాట్‌ను మొదటగా పరిచయం చేసింది టిక్ టాక్ అనే చెప్పాలి, కోట్లాది మంది యూజర్లను ఆకట్టుకుంది. కంటెంట్ క్రియేటర్లకు టిక్‌టాక్ ఒక పెద్ద ప్లాట్‌ఫామ్ అయింది. ప్రమోషన్లతో లక్షల రూపాయలు సంపాదించుకున్న వారు ఉన్నారు. సెలబ్రెటీ స్టేటస్ పొందిన వారు ఉన్నార. ఇప్పుడు Instagram Reels, YouTube Shorts, Moj, Josh వంటి యాప్‌లు చాలా వచ్చేశాయి. భారత్ లో మళ్లీ టిక్ టాక్ వచ్చినా ఈ పోటీలో నిలవడం కష్టం అంటున్నారు భారత టెక్ నిపుణులు.