Saturday, January 31, 2026
Homemoneyచిరిగిపోయిన క‌రెన్సీ నోట్లు మీ ద‌గ్గ‌ర ఉన్నాయా ఇక్క‌డ మార్చుకోండి

చిరిగిపోయిన క‌రెన్సీ నోట్లు మీ ద‌గ్గ‌ర ఉన్నాయా ఇక్క‌డ మార్చుకోండి

Published on

క‌రెన్సీకి ఎంతో విలువ ఉంటుంది. అయితే ప్ర‌జ‌ల మ‌ధ్య‌ మార‌కం లో ఈ కరెన్సీ కూడా చిరిగిపోవ‌డం జ‌రుగుతుంది. ఇప్పుడు 10.20.50.100.200.500 నోట్లు చెలామ‌ణిలో ఉన్నాయి. అయితే ఈ నోట్లు వాడినంత సేపు బాగానే ఉంటుంది కాస్త చిరిగినా లేదా టేప్ ప్లాస్ట‌ర్ లాంటిది వేస్తే దుకాణాల్లో ఎక్క‌డా సంత‌ల్లో కూడా తీసుకోరు. ఈ క‌రెన్సీ నోట్లు నానిపోవ‌డం, చెమ్మ త‌గిలి న‌లిగిపోవ‌డం ఇలా జ‌రిగినా ఈ నోట్లు తీసుకోరు. మ‌రి ఈ నోట్లు ఎక్క‌డ మార్చుకోవాలి వీటికి మ‌నం న‌గ‌దు ఎలా పొందాలి అంటే ఈ రోజు తెలుసుకుందాం.

అయితే ఇలాంటి చిరిగిన నోట్లు కొంద‌రు బ‌య‌ట షాపుల వారు మ‌ధ్య‌వ‌ర్తులు కొంత మేర కమీష‌న్ తీసుకుని మారుస్తారు. ఉదాహ‌ర‌ణ‌కు వంద నోటు చిరిగిపోతే దానికి 60 లేదా 70 రూపాయ‌లు ఇస్తారు. ఇది చాలామంది మారుస్తూ ఉంటారు. అయితే ప్ర‌జ‌లు ఖాతాదారులు తెలుసుకోవాల్సింది ఇలా చిరిగిపోయిన నోట్లు బ్యాంకుల్లో మార్చుకోవ‌చ్చు. దీనికి ఆర్బీఐ కొన్ని రూల్స్ పెట్టింది.. రిజ‌ర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నోట్ రిఫండ్ నిబంధ‌న‌లు 2009 లో వీటిని తెలియ‌చేసింది.

Also Read  ఇంట్లో క్యాష్ ఎంత ఉంచుకోవ‌చ్చో మీకు తెలుసా?

మీ ద‌గ్గ‌ర చిరిగిన నోటు ఉంటే దానిని మీకు బ్యాంకు అకౌంట్ ఉన్న చోట మార్చుకోవ‌చ్చు. ఒక‌వేళ ఈ చిరిగిన నోట్లు మార్చ‌ము అని బ్యాంకు చెబితే, ఆర్‌బీఐకి ఫిర్యాదు చేయొచ్చు. చిరిగిపోయిన నోట్‌లో ఏదైనా భాగం మిస్‌ అయినా, కరెన్సీ నోట్లు చిన్న ముక్కలుగా ఉన్నా కూడా బ్యాంకులో మార్చుకోవచ్చు. దేశ‌వ్యాప్తంగా ఉన్నా క‌మ‌ర్షియ‌ల్ బ్యాంకుల‌తో పాటు ఆర్బీఐ శాఖ‌ల్లో కూడా మార్చుకోవ‌చ్చు.

కరెన్సీ నోటు పెద్దగా దెబ్బతినకుండా ఎక్కడో చిన్న ముక్క చిరిగితే వాటిని మార్చుకొని పూర్తి మొత్తంలో డబ్బును పొందొచ్చు. అయితే ఆ క‌రెన్సీ నోట్లు ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్ర‌కారం ఉండాలి. పూర్తిగా చిరిగిపోయిన నోట్ల‌కు కొంత మేర విలువ ఇస్తారు. ఆర్బీఐ చెప్పిన‌దాని ప్ర‌కారం మీరు 20 రూపాయ‌ల లోపు కరెన్సీ నోట్ తీసుకువెళితే మొత్తం ఆ న‌గ‌దు ఇస్తారు..కాలిపోయిన నోట్ల‌ను, ఇంక్ అలాగే పెన్నుతో గీత‌లు కొట్టేసిన నోట్ల‌ను
మార్పిడి చేసేందుకు అనుమ‌తి లేదు. ఒక్క రూపాయి కూడా మీకు న‌గ‌దు రాదు. దేశంలో మీరు ఈ క‌రెన్సీ నోట్లు ఏ బ్యాంకులో అయినా మార్చుకోవ‌చ్చు

  1. చిరిగిపోయిన బాగా పాడైపోయిని నోట్లను బ్యాంకు భాష‌లో సోయిల్డ్ నోట్స్ అంటారు.
  2. బాగా దెబ్బతిన్న నోట్లను మ్యుటిలేటెడ్ నోట్స్ అని పిలుస్తారు. అయితే కేవలం ఇవి కొన్ని బ్యాంకుల్లోనే మారుస్తారు.
Also Read  జీఎస్టీ కొత్త శ్లాబ్స్ 5% - 18%...ఏ వ‌స్తువుల ధ‌ర‌లు త‌గ్గుతాయంటే

3.టేప్ వేసిన లేదా స్టాప్లర్ చేసిన నోట్లను బ్యాంకులు తీసుకోవు, ఆ టేపు తీసి మీరు నోట్లు ఇవ్వాలి.

4.కరెన్సీ నోట్ల మార్పిడికి చాలా బ్యాంకులు క్యాష్ ఇవ్వడం లేదు. డ‌బ్బులు మీ బ్యాంకు అకౌంట్లో జమ చేస్తారు.

  1. ఇక కరెన్సీ నోటు రెండుగా చీలిపోయినా మీరు మార్చుకోవ‌చ్చు.
  2. రోజుకి ఒక వ్య‌క్తి 5000 రూపాయ‌ల విలువ గ‌ల నోట్లు మార్చుకోవ‌చ్చు. అది కూడా మొత్తం 20 నోట్లు మించ‌కూడ‌దు.
    ఒక రోజులో మీరు 5000 విలువ కంటే ఎక్కువ నోట్లు మార్చుకోవాలి అంటే 5000 దాటిన‌ ప్ర‌తీ నోటుకి స‌ర్వీస్ చార్జ్ ప‌డుతుంది. అంతేకాదు మీ గుర్తింపు కార్డు ఇవ్వాల్సి ఉంటుంది.

Latest articles

IPO: రికార్డ్ సృష్టించనున్న రిలయన్స్ జియో..

రిలయన్స్ జియో త్వరలో ఐపీఓకు రానున్న విషయం తెలిసిందే. ఈ ఐపీఓ ద్వారా సుమారు రూ.40 వేల కోట్ల...

Banks Strike : 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె…!

వారానికి 5 రోజుల వర్కింగ్ డేస్ కోసం దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ ఉద్యోగులు ఈ నెల 27న సమ్మె బాట...

Google Data Center: APకి వెళ్లడం వెనుక ఉన్న నిజాలు..

గత కొన్ని రోజులుగా గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులు పెట్టబోతోందనే వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ...

Revolut:భారత మార్కెట్‌లో UPI, Visa సేవలు.

లండన్‌కు చెందిన ప్రముఖ డిజిటల్ ఫైనాన్స్ కంపెనీ Revolut త్వరలో భారత్‌లో తన పేమెంట్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించనుందని ప్రకటించింది....

cheque clearance: రేపటి నుంచి గంటల్లోనే చెక్ క్లియరెన్స్.

🔴 పాత విధానంలో (అక్టోబర్ 3, 2025 వరకు) చెక్కులు బ్యాచ్‌లుగా (ఉదయం / మధ్యాహ్నం) ప్రాసెస్ అవుతు ఉండేది. క్లియరింగ్...

ఒక్క ల‌క్ష ఉంటే చాలు ఈ బిజినెస్ లో మీకు తిరుగు ఉండ‌దు

ఈ రోజుల్లో వ్యాపారం చేయాలంటే ల‌క్ష‌ల్లో పెట్టుబ‌డి అవ‌స‌రం. అయితే కాంపిటీష‌న్ కూడా అలాగే ఉంటోంది. కానీ ఈరోజు...

More like this

Viswambhara :జులై 10న చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్?

మెగాస్టార్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ ఫాంటసీ చిత్రం విశ్వంభర విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లు సినీ వర్గాలు...

Shankar Drea Project: నిర్మాత… కానీ కఠిన నిబంధనలతో!

భారతీయ సినీ పరిశ్రమలో విజువల్ గ్రాండియర్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన దర్శకుడు శంకర్ ఎప్పటినుంచో కలగా భావిస్తున్న ప్రాజెక్ట్...

Champion Movie:OTTలోకి వచ్చేసిన ‘ఛాంపియన్’ మూవీ

యువ హీరో రోషన్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఛాంపియన్ ఇప్పుడు OTTలోకి వచ్చేసింది. గత...