Monday, October 20, 2025
HomeReviewsయూనివర్సిటీ పేపర్ లీక్ రివ్యూ

యూనివర్సిటీ పేపర్ లీక్ రివ్యూ

Published on

రెండు మూడు ద‌శాబ్దాల క్రితం పోరాటాలు, స‌మాజ మేల్కొలుపు చిత్రాలు, జ‌న‌చైత‌న్య చిత్రాలు వ‌చ్చేవి. అంతేకాదు ప్ర‌జ‌లు కూడా ఆరోజుల్లో ఆ సినిమాలు ఆద‌రించేవారు. ఈ రోజుల్లో అటువంటి న‌టులు, ఆ ఇష్టం ఉన్న ద‌ర్శ‌కులు నిర్మాత‌లు కూడా దూరం అయ్యారు.

ఇప్ప‌టికి పీపుల్ స్టార్ ఆర్ నారాయ‌ణ మూర్తి పేరు వినిపిస్తే, ఆయ‌న తీసిన సినిమాలు మ‌న‌కళ్ల ముందు క‌నిపిస్తాయి. ద మాన్ సింప్లిసిటీకి కేరాఫ్ అడ్ర‌స్ ఆయ‌న‌.

తాజాగా ఆర్‌.నారాయణమూర్తి విద్యా వ్యవస్థలోని లోపాల్ని, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఎత్తి చూపుతూ యూనివర్సిటీ పేపర్‌ లీక్ అనే సినిమాని తీశారు.

ఈ సినిమాపై ఇప్ప‌టికే టాలీవుడ్ లో ప‌లువురు ప్ర‌ముఖులు ప్ర‌శంసించారు.

క‌మెడియ‌న్ బ్ర‌హ్మ‌నందం, ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కూడా ఆయ‌న గురించి తెలియ‌చేశారు. సినిమా గురించి ప్ర‌శంసించారు.

మ‌రి ఈ సినిమాపై మంచి బ‌జ్ క‌నిపించిది తాజాగా విడుద‌లైన‌ ఈ సినిమా ఎలా ఆక‌ట్టుకుంది అనేది రివ్యూలో చూద్దాం.

Also Read  మదరాసి మూవీ యూఎస్ రివ్యూ

స్టోరీ– రామ‌య్య ఆయ‌న ప్ర‌భుత్వ స్కూల్లో టీచ‌ర్ గా ప‌నిచేస్తూ ఉంటారు. ఆయ‌న కుమారుడు అర్జున్ త‌న తండ్రిలా ఎంతో మంచి ఉన్న‌త భావాలు ఉంటాయి.

స‌ర్కారు బ‌డిలో చ‌దివి పోలీస్ ఉద్యోగం సంపాదిస్తాడు. వివాహం అయి ఇద్ద‌రు పిల్ల‌లు పుడ‌తారు. వారిని కూడా గ‌వ‌ర్మెంట్ స్కూల్లో చ‌దివించాలి అని తాత (రామ‌య్య) నారాయ‌ణ‌మూర్తి ఆలోచ‌న, అయితే కోడ‌లు దానికి ఒప్పుకోదు.

పిల్ల‌లు తాత‌పై ఇష్టంతో స‌ర్కారు స్కూల్లో చ‌దువుతాము అంటారు.
ఇలా విద్య కొన‌సాగుతుంది. ఇక్క‌డే ఓ విషాదం జ‌రుగుతుంది.

ఆ ఏడాది చివరి ప‌రీక్ష‌ల్లో మ‌న‌వ‌రాలు ఫెయిల్ అవుతుంది. దీంతో ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డానికి నాగభూషణం ప్రైవేట్‌ యూనివర్సిటీ పేపర్‌ లీక్‌ కారణమని రామయ్యకు తెలుస్తుంది.

ఆ యూనివ‌ర్శిటి న‌డిపిస్తున్న అత‌నిపై రామ‌య్య పోరుకి సిద్దం అవుతాడు.. చివ‌ర‌కు అత‌ను ఏం సాదించాడు, ఆ యూనివర్సిటీ య‌జ‌మానికి రామ‌య్య‌కు ఎప్ప‌టి నుంచో ఉన్న వైరం ఏమిటి? ఇవ‌న్నీ తెలియాలి అంటే వెండితెర‌పై ఈ సినిమా చూడాల్సిందే.

Also Read  సైలెంట్ గా ఓటీటీలోకి వ‌చ్చిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సినిమా

ఈ సినిమాకి ఆర్ నారాయ‌ణ మూర్తి పెద్ద అసెట్ .. ఎప్ప‌టిలాగా ఆయ‌న న‌ట‌న మార్క్ సెట్ చేసింది.. ఇక యూనివర్సిటీ పేప‌ర్ లీక్ అనే టైటిల్ తో ఇది కాలేజీ చుట్టు తిరుగుతుంది అని అనుకుంటాం, కానీ ఇందులో విద్య‌కు సంబంధించి అన్నీ అంశాలు స్రృశించారు.

ఇంగ్లీష్ మీడియం విద్య, ప్ర‌భుత్వ బ‌డుల వ్య‌వ‌స్ధ గురించి, ప్రైవేట్ విద్య వ్య‌వ‌స్ధ‌ దోపిడి గురించి అన్నీ కూడా ఇందులో ఆలోచింప‌చేసేలా చూపించారు.ఈ రోజుల్లో విద్యార్థులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలతోనే ఈ సినిమా మెయిన్ పాయింట్ హైలెట్ చేశారు.

ఈ ప్రైవేట్ విద్యా వ్య‌వ‌స్ద‌ల్లో జ‌రుగుతున్న‌ అన్నీ అక్ర‌మాల్ని కూడా క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపించారు.
కొన్ని సీన్లు ఎమోష‌న‌ల్ గా బాగా క‌నెక్ట్ అయ్యేలా ఉన్నాయి.నారాయ‌ణ మూర్తి సినిమాలంటే చాలా మందికి ప్ర‌త్యేక అభిమానం .. ఆయ‌న‌కు చాలా మంది అభిమానులు ఉన్నారు.

అయితే ఈ సినిమాతో వారికి ఆనందం క‌లుగుతుంది అనే చెప్పాలి. ఒక మంచి లైన్ తో ఈ సినిమాని తెర‌పై అద్భుతంగా చూపించారు. మంచి ఎమోష‌న్ తో సాగింది ఈ సినిమా.

Also Read  ప‌ర‌దా సినిమా రివ్యూ

Latest articles

OG Movie Review: పవన్ కల్యాణ్ ఫాన్స్ కు ఫుల్ మీల్స్

తెలుగు సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన సినిమాల్లో ఒకటి పవన్ కల్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన "ఓజీ...

సైలెంట్ గా ఓటీటీలోకి వ‌చ్చిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సినిమా

ఈ మ‌ధ్య ఓటీటీ కంటెంట్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.. ఏ కొత్త సినిమా వ‌చ్చినా వ‌దిలిపెట్ట‌డం లేదు.లేటెస్ట్...

లిటిల్ హార్ట్స్ రివ్యూ

90స్ మిడిల్‌క్లాస్ బ‌యోపిక్ తో యువతకు చేరువైన మౌళి త‌నూజ్ తాజాగా సిల్వ‌ర్ స్క్రీన్ పై ప‌రిచ‌యం అయ్యాడు.ఈటీవీ...

మదరాసి మూవీ యూఎస్ రివ్యూ

తమిళ స్టార్ హీరో శివ కార్తీకేయన్ హీరోగా ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్...

ఘాటీ యూఎస్ రివ్యూ

ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తాజాగా మంచి బ‌జ్ క్రియేట్ అయిన సినిమా ఘాటి.. ఈ సినిమా...

బ్ర‌హ్మండ రివ్యూ

సీనియ‌ర్ న‌టి ఆమని, కొమరక్క కీలక పాత్రలతో తెర‌కెక్కిన సినిమా బ్ర‌హ్మండ. ఈ సినిమా దాసరి సునీత సమర్పణలో...

More like this

Google Data Center: APకి వెళ్లడం వెనుక ఉన్న నిజాలు..

గత కొన్ని రోజులుగా గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులు పెట్టబోతోందనే వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ...

Final Destination: Bloodlines – భయానక హారర్ ఇప్పుడు Jio Hotstar లో

భయానక సినిమాలు చూడటం ఇష్టమా? అయితే మీకు గుడ్ న్యూస్! ప్రముఖ హారర్ ఫ్రాంచైజీ “Final Destination” సిరీస్‌లో...

YouTube Down: కానీ ఎందుకు? కారణం తెలుసా?

ప్రపంచంలో ప్రతి రోజు కోట్ల మంది వీడియోలు చూసే YouTube ఒక్కసారిగా పనిచేయకపోవడం అమెరికాలో పెద్ద సమస్యగా మారింది....