మన దేశంలో డిజిటల్ చెల్లింపులు బాగా పెరిగిపోయాయి. గత నెలలో దాదాపు 13 శాతం పెరిగాయి ఈ చెల్లింపులు. దీని బట్టి అర్దం చేసుకోవచ్చు ప్రతీ నెలా ఎంత ర్యాండమ్ గ్రోత్ కనిపిస్తుందో . ఈ డిజిటల్ చెల్లింపులు మరింత అందరికి అందుబాటులో ఉండేలా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI మరో కీలక డెసిషన్ తీసుకుంది. ఇది కస్టమర్లకు చాలా ప్రయోజనకరం. అయితే ఇది సింగిల్ ఇండివిడ్యువల్స్ కి కాకుండా వ్యాపారంలో ఉన్న వారికి భారీగా పేమెంట్లు చేయాలి అనుకునేవారికి ఉపయోగకరం.
స్టాక్స్ ఇన్వెస్ట్ చేయడం, సిప్ ఇన్వెస్ట్ చేసేవారికి, బీమా హెల్త్ ప్రీమియం కట్టేవారికి, ఎక్కువ మొత్తంలో క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లించేవారికి, సుదూర ప్రయాణాలు విమాన ప్రయాణాలు చేసేవారికి. బంగారం కొనుగోలుకి ఇలా కొన్ని ఎంపిక చేసిన వ్యాపారస్ధులకి ఆ వ్యాపార వర్గాలకి ఈ కొత్త నిర్ణయం వర్తిస్తుంది. ఒక వ్యక్తి సంస్ధకి వ్యాపారస్దులుకి 10 లక్షల వరకూ పేమెంట్ చేయవచ్చు.
అయితే ఒక వ్యక్తి మరో వ్యక్తికి పర్సనల్ గా పంపే P2P ఇప్పుడు ఎలా ఒక లక్ష పరిమితి ఉందో అలాగే కొనసాగుతుంది. మరి ఎవరు UPI ద్వారా 24 గంటల్లో రూ. 10 లక్షల వరకు లావాదేవీలు చేయవచ్చు అనేది చూస్తే?, మీరు ప్రీమియం చెల్లిస్తున్నా, బిల్లులు పే చేస్తున్నా ఇతర ఆర్దిక సేవలు ఉపయోగించుకునే వారికి ఈ అవకాశం ఉంది. ఈ కొత్త రూల్ 15 సెప్టెంబర్ 2025 నుండి అమల్లోకి వస్తుంది. ఐటీ పే చేసే వారికి కూడా ఇది ఉపయోగకరం అనే చెప్పాలి.
ఇక 24 గంటల చెల్లింపులో 10 లక్షల వరకూ చెల్లింపు చేసుకోవచ్చు. దీనిని గరిష్టంగా దాటకుండా చూసుకోవాలి.
అయితే బ్యాంకులు కస్టమర్ సేఫ్టీ ప్రకారం ముందు బ్యాంకు నుంచి దీనికి పర్మిషన్ తీసుకోవాలి. దీని వల్ల భద్రత ముప్పు ఉండదు .. ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి ధృవీకరించిన వ్యాపారులు, సంస్థలతో లావాదేవీలపై మాత్రమే ఈ సౌకర్యం వర్తిస్తుంది. కేవలం వ్యాపార సంస్ధలకు మాత్రమే.
ఒక వ్యక్తి తన స్నేహితుడికి కుటుంబ సభ్యులకి పంపిస్తే కేవలం 24 గంటల్లో 1 లక్ష రూపాయలు మాత్రమే పంపాలి. దానిలో కొత్త నిబందన రాలేదు, వ్యాపారాలకు ఇది కలిసి వచ్చే నిర్ణయం. అంతేకాదు మరింత డిజిటల్ చెల్లింపులు పెరిగేలా ఇది ప్రొత్సహిస్తుంది.
1.క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించాలి అంటే ఒక్కో లావాదేవికి పరిమితి 5 లక్షలు ఒక రోజుకి 6 లక్షలు చేయవచ్చు.
- మీరు లోన్ క్లియర్ చేయాలి అన్నా, లేదా లావాదేవీలు ఈఎమ్ ఐ చెల్లించాలి అంటే రోజు వారి పరిమితి 10 లక్షలు చేయవచ్చు.
- మీరు బీమా ప్రీమియం చెల్లించాలి అంటే లావాదేవికి 5 లక్షల వరకూ చేయవచ్చు
4విమాన ప్రయాణాలు టికెట్ బుకింగ్ , లగ్జరీ ప్రయాణాలకి, హూటల్స్ పేమెంట్స్ కి యూపీఐ లావాదేవీ చేస్తే దాదాపు 5 లక్షల వరకూ చేసుకోవచ్చు .
5.విదేశీ మారకం BBPS ద్వారా రోజులకి పరిమితి 5 లక్షల వరకూ పంపవచ్చు.