కోలీవుడ్ యాక్షన్ హీరో, విలక్షణ నటుడు విశాల్ తన పుట్టినరోజున అభిమానులకు తీపి కబురు అందించారు. తన ప్రేయసితో ఎంగేజ్ మెంట్ శుక్రవారం ఘనంగా జరిగింది .ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో విశాల్ ఇంటిలో ఈ వేడుక జరిగింది.
ప్రస్తుతం ఈ జంట ఉంగరాలు మార్చుకుంటున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి, ఇక ఈ జంటకి అందరూ శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. ఇక విశాల్ చేసుకునే అమ్మాయి ఎవరు ఆమె బ్యాగ్రౌండ్ గురించి చాలా మంది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి నటి సాయి ధన్సిక గురించి ఈ రోజు తెలుసుకుందాం.
హీరో విశాల్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్‌తో పాటు తెలుగు లోనూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
విశాల్ ఇటీవల చెన్నైలో నిర్వహించిన ఓ సినిమా ఈవెంట్లో పెళ్లి చేసుకోనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. తను సాయి ధన్సికని త్వరలో వివాహం చేసుకుంటున్నా అనే ప్రకటన చేయడంతో అభిమానులు ఎంతో ఆనందించారు.
సాయి ధన్సిక నవంబర్ 20,1990న తమిళనాడులోని తంజావూరులో జన్మించింది. ఆమె 2006 లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మనతోడు మలైకాలం చిత్రంతో తెరంగేట్రం చేసింది ధన్సిక. అయితే ఇప్పటి వరకూ ఆమె సినిమా కెరియర్ లో ఎక్కువగా సపోర్టింగ్ రోల్స్ మాత్రమే చేసింది.
తమిళంలో ఎక్కువ సినిమాలు చేసినా అంత పెద్ద గుర్తింపు రాలేదు.ఇండస్ట్రీలోకి వచ్చిన దాదాపు 10 ఏళ్ల తర్వాత 2016లో వచ్చిన కబాలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రంలో రజనీ కుమార్తెగా అద్బుతంగా నటించింది.
తెలుగులో వాలుజడ, షికారు, అంతిమ తీర్పు ఇలా పలు సినిమాలు చేసింది. ఇక ఆమె అప్ డేట్స్ అన్నీ కూడా నిత్యం సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటుంది.
ఆమెకి లక్షలాది మంది అభిమానులు ఉన్నారు.
సాయి ధన్సిక నటించిన యోగి సినిమా ఆడియో విడుదల చెన్నైలో జరిగింది ఈ సమయంలో విశాల్ కూడా ఈవెంట్ కు హాజరయ్యారు, ఈ వేదికపై ఆయన పెళ్లి ప్రకటన చేశారు. తల్లిదండ్రుల సమ్మతితో ఈ విషయాన్ని వెల్లడిస్తున్నట్లు ఇదే కార్యక్రమంలో విశాల్ తెలిపారు.
చెన్నైలోని నడిగర్ సంఘం బిల్డింగ్ నిర్మాణం పూర్తయ్యాక అందులోనే వివాహం చేసుకుంటానని గతంలో ప్రకటించాడు విశాల్. సో ఇప్పుడు ఆయన వివాహం ఎక్కడ జరుగుతుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు.
విశాల్ పందెం కోడి, పొగరు, భరణి, పూజ, అభిమన్యుడు, డిటెక్టివ్, మార్క్ ఆంటోని, లాఠీ ఇలా అద్బుతమైన చిత్రాలతో అలరించారు. విశాల్ గత ఏడాది రత్నం సినిమాతో అలరించారు. ప్రస్తుతం మరిన్ని సినిమాలు లైనప్ లో ఉన్నాయి.
ఈ నూతన జంటకి అందరూ బెస్ట్ విషెస్ తెలియచేస్తున్నారు.