Sunday, March 22, 2026
HomeNewsRahul Gandhi Vs EC: రాహుల్ గాంధీ ఆరోపణల తర్వాత ఈసీ స్ట్రాంగ్ కౌంట‌ర్

Rahul Gandhi Vs EC: రాహుల్ గాంధీ ఆరోపణల తర్వాత ఈసీ స్ట్రాంగ్ కౌంట‌ర్

Published on

దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఒక అంశం పై చ‌ర్చ సాగుతోంది.కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. అన్నీ రాష్ట్రాల్లో కాంగ్రెస్ నాయ‌కులు ఆ పార్టీ శ్రేణులు ఈ అంశం పై ప్ర‌శ్న‌లు లేవ‌నెత్తుతున్నారు. ఓటర్ల జాబితాలోని అవకతవకల గురించి ఇటీవ‌ల అంటే ఆగస్టు 7న, రాహుల్ గాంధీ ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. దీని త‌ర్వాత ఈ అంశం దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌కు కార‌ణం అయింది.

అస‌లు రాహుల్ ఏమి కామెంట్ చేశారు? ఈ వివాదం ఎక్క‌డ మొద‌లైంది అనేది చూస్తే.
రాహుల్ గాంధీ ఆగస్టు 7న ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఎన్నికల సంఘం గురించి దాదాపు గంట పాటు ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈసీ పై ఆయ‌న అనేక ఆరోప‌ణ‌లు చేశారు.
2024 లోక్‌సభ ఎన్నికల గురించి మాట్లాడారు, ఓట్లు దోపిడికి గురి అవుతున్నాయి అని ఎన్నిక‌ల సంఘం పై ఆరోప‌ణ‌లు చేశారు.

అంతేకాకుండా ఉదాహ‌ర‌ణ‌గా కర్ణాటకలోని మహదేవపుర లోక్ సభ నియోజకవర్గంలో ల‌క్ష ఓట్లు తారుమారు చేశారని,
డూప్లికేట్ ఓట్లు క్రియేట్ చేస్తున్నారని, దొంగ ఓట్లు, త‌ప్పుడు చిరునామాల‌తో ఒకే ఇంట్లో ప‌దుల సంఖ్య‌లో ఓట్లు చేరుస్తున్నార‌ని ఆరోపించారు. అస‌లు ఇంటి చిరునామా జీరోతో కూడా అనేక ఓట్లు ఉన్నాయి అంటూ ఆయ‌న సీరియ‌స్ అయ్యారు.

Also Read  దేశ ప్ర‌జ‌ల‌కు గుడ్ న్యూస్..ఈ వ‌స్తువుల ధ‌ర‌లు తగ్గనున్నాయి.

కొత్త ఓటర్ల కోసం ఉన్న ఫామ్ 6ను దుర్వినియోగం చేస్తున్నార‌ని, ఒకే అడ్ర‌స్ పై 20 లేదా 30 మందికి ఓట్లు ఉన్నాయి అని ఇవ‌న్నీ కూడా ఫేక్ ఓట్లు అంటూ సీరియ‌స్ అయ్యారు రాహుల్ గాంధీ. అంతేకాకుండా 70 ఏళ్ల శకున్ రాణి అనే మహిళ ఫామ్ 6ను ఉపయోగించుకుని తొలిసారి ఓట‌ర్ గా న‌మోదు చేయించుకుంది, ఇలా ఆరు నెల‌ల కాలంలో రెండు సార్లు రిజిస్ట్రేష‌న్ చేయించుకుంది. దీనిపై చెక్ చేస్తే ఓట‌ర్ లిస్ట్ లో ఆమె పేరు రెండు సార్లు ఉంది.
ఇలాంటి ఉదాహ‌ర‌ణ‌లు వేల‌కు పైనే ఉన్నాయి అంటూ రాహుల్ సీరియ‌స్ అలిగేష‌న్ చేశారు.

కొంద‌రికి రెండు రాష్ట్రాల్లో కూడా ఓట్లు ఉన్నాయి. వారు ఎక్క‌డ ఎక్క‌డ ఓట్లు వేశారు ఇలా అనేక ప్ర‌శ్న‌లు అనుమానాలు లేవ‌నెత్తుతున్నారు. బీజేపీతో క‌లిసి ఈసీ ఈ కుట్ర చేస్తోందని రాహుల్ అన్నారు.
ప్రజలు, పార్టీలు ధృవీకరించేలా ఈసీ డిజిటల్ ఓటరు జాబితాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇలా చేస్తే పార‌ద‌ర్శ‌క‌త పెరుగుతుందన్నారు రాహుల్.

Also Read  కర్రీపఫ్‌లో దర్శనమిచ్చిన పాము... ఎప్పుడైనా ఇలా జ‌రిగితే వెంట‌నే ఈ ప‌ని చేయండి..

ఈ ఆరోప‌ణ‌ల త‌ర్వాత రాహుల్ ఓటర్ చోరి వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.రాహుల్ వ్యాఖ్య‌ల‌తో బీజేపీ వ్య‌తిరేక పార్టీలు ఆయా రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ మ‌ద్ద‌తు ప‌క్షాలు సపోర్ట్ గా నిలుస్తున్నాయి. అయితే రాహుల్ కామెంట్ల పై ఎన్నిక‌ల సంఘం సీరియ‌స్ అయింది, ఇవ‌న్నీ ఆధారాలు లేని కామెంట్లు అంటూ రాహుల్ కి కౌంట‌ర్ ఇచ్చింది.

ఇలాంటి ఆరోప‌ణ‌లు గ‌తంలో కూడా వ‌చ్చాయి బీజేపీ నుంచి ఎల్ కే అద్వానీ కూడా గతంలో ఈసీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే కాంగ్రెస్ శ్రేణులు కూడా గ‌తంలో ఈసీ నిర్ణయాలపై తీవ్రంగా వ్య‌తిరేకించారు. దేశంలో ఇది కొత్త ఏమీ కాదు. ఓట‌మి త‌ర్వాత రాజ‌కీయ పార్టీలు చేసే సాధార‌ణ కామెంట్ ఇది. అయితే బీజేపీ కూడా వారు ఎన్నికల్లో ఓట‌మి చెందారు కాబ‌ట్టి ఇలా అంటున్నారు. అధికార ప‌క్షం పై బుర‌ద‌చ‌ల్లే ప్ర‌క్రియ అంటూ రాహుల్ గాంధీ ఆరోప‌ణ‌ల‌కి కౌంట‌ర్ ఇస్తోంది.

రాహుల్ గాంధీ ఆరోపణల తర్వాత ఈసీ స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చింది. రాహుల్ గాంధీ ఎత్తి చూపిన అంశాలు అన్నీ నెల‌ల క్రిత‌మే స‌రిచేశాము, ఏదైనా చ‌ట్ట‌బ‌ద్దంగా చేయాలి కాని ఇలా బ‌హిరంగంగా ఆరోప‌ణ‌లు చేయ‌డం స‌రికాదు, రాహుల్ వ్యాఖ్య‌ల త‌ర్వాత కర్ణాటక సీఈఓతో పాటు హర్యానా, మహారాష్ట్ర ప‌లు రాష్ట్రాల ఎన్నిక‌ల అధికారులు రాహుల్ గాంధీకి నోటిసులు ఇచ్చారు. ఆయన చేసిన ఆరోపణలకు డాక్యుమెంటరీ ఆధారాలను సమర్పించాలని, సంత‌కం చేసిన అఫిడ‌విట్ స‌మ‌ర్పించాల‌ని లేదంటే దేశానికి క్ష‌మాప‌ణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Also Read  జ‌గ‌న్ కు భారీ షాక్ పులివెందుల‌లో ఓట‌మి 30 ఏళ్ల చ‌రిత్ర‌లో రికార్డ్

రాహుల్ గాంధీ చేసిన ఆరోప‌ణ‌ల‌పై దేశ వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోంది

Latest articles

Gold Murder:బంగారం కోసం వృద్ధురాలి దారుణ హత్య..

బంగారం కోసం వృద్ధురాలిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన నల్గొండ జిల్లా హాలియాలో తీవ్ర కలకలం రేపింది....

Blinkit: 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ బంద్..

గిగ్ వర్కర్ల డిమాండ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ విధానాన్ని...

Telangana govt:భారీగా బీర్ల ఉత్పత్తి.. కంపెనీలకు ప్రభుత్వ నిర్దేశం

వేసవికాలంలో బీర్లకు డిమాండ్ భారీగా పెరుగుతుండటంతో వాటి ఉత్పత్తిని మరింత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత వేసవిలో రోజుకు...

Mary Kom Divorce:‘జూనియర్ బాక్సర్తో మేరీ కోమ్కు అఫైర్’.. మాజీ భర్త సంచలన ఆరోపణలు

తనను మోసం చేసి ఆస్తులు లాక్కున్నారన్న మేరీ కోమ్ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఆమె మాజీ భర్త...

Youtuber Anvesh :ట్రావెలింగ్ ఆపేస్తున్నా!

తాను ట్రావెలింగ్ ఆపేద్దామనుకుంటున్నట్లు యూట్యూబర్ అన్వేష్ తెలిపారు. “130 దేశాలు తిరిగాను. ఇక సంపాదించింది చాలు. నా దగ్గర...

Senior citizens : కోసం డేకేర్ సెంటర్లు..

తెలంగాణలోని వృద్ధులకు శుభవార్త. 60 ఏళ్లు పైబడిన వృద్ధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 37 ‘డేకేర్ సెంటర్లు’ ఏర్పాటు...

More like this

Viswambhara :జులై 10న చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్?

మెగాస్టార్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ ఫాంటసీ చిత్రం విశ్వంభర విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లు సినీ వర్గాలు...

Shankar Drea Project: నిర్మాత… కానీ కఠిన నిబంధనలతో!

భారతీయ సినీ పరిశ్రమలో విజువల్ గ్రాండియర్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన దర్శకుడు శంకర్ ఎప్పటినుంచో కలగా భావిస్తున్న ప్రాజెక్ట్...

Champion Movie:OTTలోకి వచ్చేసిన ‘ఛాంపియన్’ మూవీ

యువ హీరో రోషన్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఛాంపియన్ ఇప్పుడు OTTలోకి వచ్చేసింది. గత...