ఫ్రిజ్‌లో పెట్టిన పుచ్చకాయని తింటున్నారా..? అది ఎంత ప్రమాదమో తెలుసుకోండి.

  • Health
  • May 13, 2025
  • 0 Comments

సమ్మర్‌లో పుచ్చకాయ తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. రోజూ వీటిని తినడం వల్ల శరీరం చల్లబడుతుందని తెలియజేస్తున్నారు. పుచ్చకాయలో 92 శాతం నీరు ఉంటుందట. దీనివల్ల చెమట ద్వారా శరీరం కోల్పోయిన నీటిని పుచ్చకాయ తినడం వల్ల పొందవచ్చు. అయితే అయితే కోసిన తర్వాత ఫ్రిజ్‌లో పెట్టినప్పుడు ఈ తేమతో బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది. ఇది ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీసే అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్న పిల్లలు, వయసైన వారైతే ఇలాంటి ఫ్రిజ్ పండ్లను తినకుండా ఉండటం మంచిది.

ఫ్రిజ్‌లో ఉంచిన పుచ్చకాయ తిన్న తర్వాత కొన్ని గంటల్లోనే కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. పుచ్చకాయ సహజంగా శరీరాన్ని చల్లగా ఉంచే స్వభావం కలిగి ఉంటుంది. అందుకే దీనిని ఎక్కువగా వేసవిలో తింటుంటారు. కానీ ఫ్రిజ్‌లో ఉంచిన పుచ్చకాయ మరింత చల్లగా మారిపోతుంది. దీన్ని తిన్న వెంటనే కొందరికి దగ్గు, జలుబు, గొంతు సమస్యలు రావచ్చు. ముఖ్యంగా రాత్రి పూట చల్లటి పుచ్చకాయ తింటే జీర్ణక్రియ మందగించడమే కాకుండా అజీర్ణ సమస్యలు రావచ్చు. అలాగే ఇది ఎక్కువ నీటి శాతం కలిగి ఉండటం వల్ల తరచూ మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావచ్చు.

Also Read  ఇంజెక్షన్‌ చేసిన పుచ్చకాయను ఇలా చేసి వెంటనే గుర్తించండి, లేదంటే అంతే సంగతులు.

దీంతో నిద్రకు అంతరాయం కలుగుతుంది. పుచ్చకాయను కోసిన వెంటనే తినేయడం ఉత్తమం. ఒకవేళ ఫ్రిజ్‌లో ఉంచాల్సి వస్తే రంధ్రాలు ఉన్న మూతతో కవర్ చేసి ఉంచాలి. దీని వల్ల ఫలంలో ఎక్కువగా తేమ ఉండకుండా బ్యాక్టీరియా పెరగకుండా ఉంటుంది. అయితే నిపుణుల ప్రకారం పుచ్చకాయను కోసిన వెంటనే 2-3 గంటలలోపే తినేయడం ఆరోగ్యానికి మంచిది. పుచ్చకాయ రాత్రి తినడం ఆరోగ్య నిపుణులు సిఫారసు చేయడం లేదు. ఎందుకంటే రాత్రి సమయంలో జీర్ణక్రియ మందగిస్తే కడుపులో గందరగోళం కలుగుతుంది. అలాగే ఇందులో అధిక నీటి శాతం ఉండటం వల్ల తరచూ మూత్ర విసర్జన అవసరమవుతుంది.

ఇది నిద్రకు అంతరాయం కలిగించవచ్చు. కాబట్టి పుచ్చకాయను ఉదయం లేదా మధ్యాహ్నం సమయంలో తినడం ఉత్తమం. పుచ్చకాయను పూర్తిగా తినలేకపోతే దానిని జ్యూస్ చేసుకుని తాగడం ఉత్తమం. అలాగే పుచ్చకాయ ముక్కలను వడగట్టి నిల్వ చేసుకోవచ్చు. కానీ ఫ్రిజ్‌లో ఉంచి మరుసటి రోజు తినడం వల్ల దాని పోషకాలు తగ్గిపోతాయి. అందుకే తాజా పుచ్చకాయను తినడమే ఉత్తమమైన ఎంపిక. పుచ్చకాయ వేసవి కాలానికి మంచి శరీర శీతల పండుగా మారినా దీన్ని సరైన పద్ధతిలో తినకపోతే ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.

Also Read  రాత్రి పడుకునే ముందు పాలల్లో ఇది ఒక్క స్పూన్‌ వేసుకొని తాగితే చాలు, మీకు సూపర్ పవర్స్ వస్తాయ్.

ఫ్రిజ్‌లో ఉంచిన తర్వాత తినడం వల్ల పోషకాలు తగ్గిపోతాయి బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదం ఉంటుంది. అందుకే పుచ్చకాయను కోసిన వెంటనే తినడం ఆరోగ్యానికి మంచిది


Discover more from TeluguPost TV

Subscribe to get the latest posts sent to your email.

  • Related Posts

    ఇంజెక్షన్‌ చేసిన పుచ్చకాయను ఇలా చేసి వెంటనే గుర్తించండి, లేదంటే అంతే సంగతులు.

    Share this… Facebook Whatsapp Telegram Twitter Threads Linkedin Pinterest ఎండాకాలం అంటే తప్పకుండా తినాల్సిన ప్రూట్ పుచ్చకాయ. వాటర్ కంటెంట్ అధికంగా ఉండే ఈ పండును పిల్లల్ని నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటుంటారు. అయితే ఈ మధ్య…

    Read more

    రాత్రి పడుకునే ముందు పాలల్లో ఇది ఒక్క స్పూన్‌ వేసుకొని తాగితే చాలు, మీకు సూపర్ పవర్స్ వస్తాయ్.

    Share this… Facebook Whatsapp Telegram Twitter Threads Linkedin Pinterest తినాలని అనిపించినా సరే.. నోరును కట్టేసుకుంటారు. కానీ, నెయ్యిని మితంగా తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పాలలో కలిపి తీసుకోవడం…

    Read more

    Leave a Reply

    Discover more from TeluguPost TV

    Subscribe now to keep reading and get access to the full archive.

    Continue reading