తాను ట్రావెలింగ్ ఆపేద్దామనుకుంటున్నట్లు యూట్యూబర్ అన్వేష్ తెలిపారు. “130 దేశాలు తిరిగాను. ఇక సంపాదించింది చాలు. నా దగ్గర రూ.8 కోట్లు ఉన్నాయి.
వాటితో మీకోసం కాకుండా నాకోసం మిగిలిన దేశాలు తిరుగుతా. ప్రాణం ఉన్నంత వరకూ ప్రజా సమస్యలపై పోరాడుతా” అని ఓ వీడియోలో స్పష్టం చేశారు.
కాగా ఇటీవల గరికిపాటి వివాదం కారణంగా ఆయన ఛానళ్లకు సబ్స్క్రైబర్ల సంఖ్య భారీగా తగ్గిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలోనే తన జీవనశైలిలో మార్పు తీసుకురావాలని నిర్ణయించుకున్నట్లు అన్వేష్ చెప్పడం గమనార్హం.
ఇకపై ట్రావెల్ కంటెంట్ కంటే సామాజిక అంశాలు, ప్రజా సమస్యలపై తన దృష్టి ఎక్కువగా ఉండనుందని ఆయన సంకేతాలు ఇచ్చారు. సోషల్ మీడియాలో ఈ ప్రకటనపై మిశ్రమ స్పందన కనిపిస్తోంది.