Thursday, March 19, 2026
HomeNewsరైల్వే ప్ర‌యాణికుల‌కి ..... ఈ టైమ్ త‌ర్వాత టీటీఈ చెకింగ్ కి వస్తే? కొత్త రూల్

రైల్వే ప్ర‌యాణికుల‌కి ….. ఈ టైమ్ త‌ర్వాత టీటీఈ చెకింగ్ కి వస్తే? కొత్త రూల్

Published on

దూర‌ప్రాంతాల‌కు ప్ర‌యాణం చేయాలి అంటే ట్రైన్ జర్నీకే అంద‌రూ మొగ్గుచూపుతారు. నిత్యం ల‌క్ష‌లాది మంది రైలు ప్ర‌యాణాలు చేస్తూ ఉంటారు.

అయితే భార‌తీయ రైల్వే కూడా ప్ర‌యాణికుల కోసం ఎన్నో కొత్త నిర్ణ‌యాలు తీసుకుంటుంది. వాటిని ప్ర‌జ‌ల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు తెలియ‌చేస్తుంది. సోష‌ల్ మీడియాలో కూడా రైల్వే అప్ డేట్స్ క్ష‌ణాల్లో ప్ర‌జ‌ల‌కు అందుతున్నాయి. ఈ డిజిట‌ల్ యుగంలో క్విక్ గా రెస్పాన్స్ అనేది రైల్వే నుంచి వ‌స్తోంది.

రైల్వే శాఖ ప్ర‌యాణికుల సౌక‌ర్యార్దం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యవంతంగా జర్నీ చేసేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. ఉద‌యం పూట జ‌ర్నీ అంటే సాధార‌ణంగా ఎలాంటి ఇబ్బంది ఉండ‌దు, రాత్రి పూట ట్రైన్ జ‌ర్నీలో ఎన్నోజాగ్ర‌త్త‌లు కూడా తీసుకోవాలి.

రైల్వే కూడా గార్డుల‌ని సెక్యూరిటీని ట్రైన్స్ లో ఏర్పాటు చేస్తుంది. ప్ర‌యాణికుల‌కి ర‌క్ష‌ణ‌గా ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌక‌ర్యంగా ఉండేలా చూస్తుంది.

ఇటీవ‌ల రాత్రిపూట టీటీఈలు టికెట్ల చెకింగ్ కు వచ్చి నిద్రకు భంగం కలిగిస్తున్నారని పలువురు ప్రయాణీకులు భారతీయ రైల్వేకు ఫిర్యాదు చేశారు. దీనిపై రైల్వేశాఖ కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు జారీచేసింది
TTE రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య స్లీపర్, AC కోచ్‌ లలో టికెట్లను తనిఖీ చేయకుండా రైల్వే మార్గదర్శకాలు ఉన్నాయి.

Also Read  హీరోయిన్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే వేధింపులు

అయితే ఇక్క‌డ మ‌రో విష‌యాన్ని గ‌మ‌నించాలి ఎవ‌రైనా రాత్రి 10 గంట‌లు దాటిన త‌ర్వాత 11 లేదా 12 గంట‌లు అర్ద‌రాత్రి ట్రైన్ ఎక్కితే క‌చ్చితంగా ఆ ప్ర‌యాణికుడి టికెట్ టీటీఈ చెక్ చేయ‌వ‌చ్చు. ప‌ది గంట‌ల ముందు ట్రైన్ లో ఎక్కిన వారికి ఈ లోపు మాత్ర‌మే చెకింగ్ పూర్తి చేస్తారు. ఆ త‌ర్వాత వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చెకింగ్ ప్రాసెస్ ఉండ‌దు. రాత్రి 10 త‌ర్వాత ప్రయాణీకులు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిద్రపోయే అవకాశం ఉంటుంది.

ఈ విష‌యంలో ఏదైనా ఇబ్బంది క‌లిగితే 139లో రైల్వే హెల్ప్‌ డెస్క్‌ కు కాల్ చేయవ‌చ్చు. ఇది 24 గంట‌లు ప‌నిచేస్తుంది
ఇక రాత్రి స‌మ‌యంలో ఫోన్లు సౌండ్ పెట్టుకుని తోటి ప్ర‌యాణికుల‌కి ఇబ్బంది క‌లిగించ‌కూడ‌దు
హెడ్ ఫోన్లు పెట్టుకుని ప్ర‌యాణికుల‌కి ఇబ్బంది లేకుండా పాట‌లు మ్యూజిక్ విన‌వ‌చ్చు
తోటి ప్ర‌యాణికుల‌కి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు ప్ర‌వ‌ర్తించాలి
రాత్రి పది గంటల తర్వాత, కోచ్ మెయిన్ లైట్లు ఆఫ్ చేయబడుతాయి.
రాత్రి పూట గట్టిగా మాట్లాడడం, అర‌వ‌డం చేయకూడదు.
వీటిలో ఏ స‌మ‌స్య వ‌చ్చినా ప్యాసింజ‌ర్స్ 139కి కాల్ చేయ‌వ‌చ్చు.

Also Read  Vande bharath Sleeper Train:ఈ నెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం

Latest articles

Gold Murder:బంగారం కోసం వృద్ధురాలి దారుణ హత్య..

బంగారం కోసం వృద్ధురాలిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన నల్గొండ జిల్లా హాలియాలో తీవ్ర కలకలం రేపింది....

Blinkit: 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ బంద్..

గిగ్ వర్కర్ల డిమాండ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ విధానాన్ని...

Telangana govt:భారీగా బీర్ల ఉత్పత్తి.. కంపెనీలకు ప్రభుత్వ నిర్దేశం

వేసవికాలంలో బీర్లకు డిమాండ్ భారీగా పెరుగుతుండటంతో వాటి ఉత్పత్తిని మరింత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత వేసవిలో రోజుకు...

Mary Kom Divorce:‘జూనియర్ బాక్సర్తో మేరీ కోమ్కు అఫైర్’.. మాజీ భర్త సంచలన ఆరోపణలు

తనను మోసం చేసి ఆస్తులు లాక్కున్నారన్న మేరీ కోమ్ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఆమె మాజీ భర్త...

Youtuber Anvesh :ట్రావెలింగ్ ఆపేస్తున్నా!

తాను ట్రావెలింగ్ ఆపేద్దామనుకుంటున్నట్లు యూట్యూబర్ అన్వేష్ తెలిపారు. “130 దేశాలు తిరిగాను. ఇక సంపాదించింది చాలు. నా దగ్గర...

Senior citizens : కోసం డేకేర్ సెంటర్లు..

తెలంగాణలోని వృద్ధులకు శుభవార్త. 60 ఏళ్లు పైబడిన వృద్ధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 37 ‘డేకేర్ సెంటర్లు’ ఏర్పాటు...

More like this

Viswambhara :జులై 10న చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్?

మెగాస్టార్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ ఫాంటసీ చిత్రం విశ్వంభర విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లు సినీ వర్గాలు...

Shankar Drea Project: నిర్మాత… కానీ కఠిన నిబంధనలతో!

భారతీయ సినీ పరిశ్రమలో విజువల్ గ్రాండియర్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన దర్శకుడు శంకర్ ఎప్పటినుంచో కలగా భావిస్తున్న ప్రాజెక్ట్...

Champion Movie:OTTలోకి వచ్చేసిన ‘ఛాంపియన్’ మూవీ

యువ హీరో రోషన్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఛాంపియన్ ఇప్పుడు OTTలోకి వచ్చేసింది. గత...