Tuesday, October 21, 2025
HomeNewsTrump Tariff War : చైనాపై 125% పెంపు, ఇతరులకు 90 రోజుల విరామం

Trump Tariff War : చైనాపై 125% పెంపు, ఇతరులకు 90 రోజుల విరామం

Published on

ప్రపంచ మార్కెట్లు కుప్పకూలుతున్న వేళ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.
పలు దేశాలపై విధించిన టారిఫ్‌లను 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, చైనాకు మాత్రం టారిఫ్ రేటును ఏకంగా 125%కి పెంచారు.

ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ ద్వారా మరింత ఘాటుగా మాట్లాడారు.
“ప్రపంచ మార్కెట్ల పట్ల చైనా చూపుతున్న నిర్లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని, అమెరికా చైనాపై విధిస్తున్న టారిఫ్‌ను ఏకంగా 125%కి పెంచారు . ఇది తక్షణమే అమల్లోకి వస్తుంది. ” అని ఆయన పేర్కొన్నారు

ఈ ప్రకటన వెలువడగానే ప్రపంచ మార్కెట్లు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాయి.
S&P 500 సూచిక దాదాపు 7% పెరిగింది. అయితే, చైనా మినహా ఇతర దేశాలపై టారిఫ్ తగ్గింపుల గురించిన పూర్తి వివరాలు మాత్రం ఇంకా చెప్పా లేదు.
.

ఇంతకుముందు ట్రంప్ చేసిన టారిఫ్ పెంపుదల లో , “75కి పైగా దేశాలు అమెరికాతో చర్చలు జరపడానికి సంప్రదించాయి. ఈ దేశాలు ఎలాంటి ప్రతీకార చర్యలు తీసుకోలేదు.

Also Read  అసలు అమ్మాయిలకి ప్రతినెల పీరియడ్స్ ఎందుకు వస్తాయి..?

కావున వారికి 90 రోజుల విరామం ఇవ్వడానికి మరియు 10% తగ్గిన పరస్పర టారిఫ్‌ను అమలు చేయడానికి అనుమతి ఇచ్చం.” అని తెలిపారు.
ఈ 10% టారిఫ్ పోయిన శనివారం నుండి కొత్తగా అమల్లోకి వచ్చింది. ఇది యూరోపియన్ యూనియన్‌పై ఉన్న 20%, జపాన్‌పై ఉన్న 24% మరియు దక్షిణ కొరియాపై ఉన్న 25% టారిఫ్‌లతో పోలిస్తే తక్కువే అయినప్పటికీ, గతంలో అమెరికా విధించిన టారిఫ్‌లతో పోలిస్తే ఇది పెరుగుదలే.

ట్రంప్ చర్యలకు ప్రతిగా చైనా బుధవారం అమెరికా సరుకులపై 84% టారిఫ్‌లు పెంచింది.

ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల(USA And China ) మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదిరేలా ఈ చర్యలు ఉన్నాయి.

ట్రంప్ విధించిన “Reciprocal” టారిఫ్‌లు అదే రోజు అమల్లోకి వచ్చాయి, వీటిలో చైనా తీవ్రంగా నష్టపోయింది.

కెనడా కూడా అమెరికా విధించిన 25% ఆటో టారిఫ్‌లను అనుసరించింది.

అమెరికా స్టీల్ మరియు అల్యూమినియంపై 25% టారిఫ్‌లు విధించడంతో యూరోపియన్ యూనియన్ కూడా అమెరికా సరుకులపై కొత్త పన్నులు విధించింది.

Also Read  Secunderbad CTC Market: మోసాలు,ప్రమాదాలతో నిండిపోయిందా?

అమెరికా మరింత టారిఫ్‌లకు పాల్పడితే “మేము చివరి వరకు పోరాడతాం” అని చైనా ఇదివరకే చెప్పడం జరిగింది.

మధ్యరాత్రి నుంచే ట్రంప్ విధించిన టారిఫ్‌లు అమల్లోకి వచ్చాయి:

చైనాపై 104%, యూరోప్‌పై 20%, జపాన్‌పై 24% మరియు దక్షిణ కొరియాపై 25%. చర్చల ద్వారా ఈ రేట్లు తగ్గవచ్చని ట్రంప్ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, అది జరగడానికి నెలల సమయం పట్టవచ్చని అధికారులు అంటున్నారు.

Latest articles

Sliver Stolen: ఒక్కక్షణం ఆగినందుకు 11 కిలోల వెండి మాయం.

ఉత్తర తూర్పు ఢిల్లీలోని న్యూ ఉస్మాన్‌పూర్ ప్రాంతంలో ఆశ్చర్యపరిచే ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై జరిగిన చిన్న గొడవలో స్కూటర్...

ICC Women’s Cricket World Cup 2025: Full Schedule, Teams, Venues & Key Matches

The ICC Women’s Cricket World Cup 2025 is set to bring thrilling action to...

T20 Asia & EAP Qualifier 2025: వరల్డ్ కప్ అర్హతలు.

T20 వరల్డ్ కప్ అనేది ప్రపంచంలో టాప్ క్రికెట్ దేశాలు పోటీ పడే ఒక క్రికెట్ టోర్నమెంట్.ఇది చిన్న...

Bigg Boss Kannada 11: కాలుష్యం కారణంగా Karnataka Pollution Board ఆపేయమన్న ఆదేశం.

. బిగ్ బాస్ కన్నడ సీజన్ 11 షూటింగ్ ప్రదేశం చుట్టూ పర్యావరణ కాలుష్యం పెరుగుతోందని గుర్తించిన కర్ణాటక రాష్ట్ర...

Kerala Lottery:పేదలకు కలలు నెరవేర్చే ప్రభుత్వ బహుమతి

పరిచయం భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు మాత్రమే లాటరీలను చట్టబద్ధంగా నిర్వహిస్తున్నాయి. వాటిలో కేరళా రాష్ట్రం తన లాటరీ వ్యవస్థతో ప్రత్యేక...

High Court:కేవలం బాధితురాలి సాక్ష్యం సరిపోదు … హైకోర్టు పదేళ్ల జైలు శిక్షను రద్దు చేసింది.

హైదరాబాద్ కిషన్బాగ్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ ఇర్ఫాన్ఖాన్ పై నమోదైన అత్యాచార కేసులో నాంపల్లి కోర్టు విధించిన 10...

More like this

Google Data Center: APకి వెళ్లడం వెనుక ఉన్న నిజాలు..

గత కొన్ని రోజులుగా గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులు పెట్టబోతోందనే వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ...

Final Destination: Bloodlines – భయానక హారర్ ఇప్పుడు Jio Hotstar లో

భయానక సినిమాలు చూడటం ఇష్టమా? అయితే మీకు గుడ్ న్యూస్! ప్రముఖ హారర్ ఫ్రాంచైజీ “Final Destination” సిరీస్‌లో...

YouTube Down: కానీ ఎందుకు? కారణం తెలుసా?

ప్రపంచంలో ప్రతి రోజు కోట్ల మంది వీడియోలు చూసే YouTube ఒక్కసారిగా పనిచేయకపోవడం అమెరికాలో పెద్ద సమస్యగా మారింది....