గతంలో పెళ్లి అంటే ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు చూడాలి అనేవారు, కానీ రోజులు మారిపోయాయి, ఇప్పుడు అమ్మాయి కుటుంబం అబ్బాయి కుటుంబం ఈ రెండు కుటుంబాల గురించి తెలుసుకుంటే చాలు అనే స్ధాయికి వచ్చేశారు.
అయితే అమ్మాయికి అయినా అబ్బాయికి అయినా ఇద్దరికి ఇష్టం అయితేనే వివాహం చేయాలి లేకపోతే వారు కలిసి జీవించలేరు. ఇటీవల ఇష్టం లేని వివాహాలు చేసుకుని, పెద్దల మాట కాదు అనలేక, చివరకు పెళ్లి అయిన వారితో కలిసి ఉండలేక విడిపోతున్న జంటలు ఎన్నో చూశాం.
ముఖ్యంగా అమ్మాయిలు కూడా ప్రేమించిన వాడి కోసం చివరకు పెళ్లి మండపం నుంచి వెళ్లిపోతున్న సంఘటనలు చూశాం. ఈ కేసు గురించి వింటే మీరు షాక్ అవుతారు.
అమిత్ అగర్వాల్ అనే వ్యక్తికి వివాహం జరిగింది. బాగా ధనవంతుల కుటుంబం. అగర్వాల్ తండ్రి గోల్డ్ బిజినెస్. అమ్మాయి స్వేఛ్చ ఆమె తండ్రి గవర్నమెంట్ స్కూల్లో టీచర్.
పెద్ద ఆస్తిపరులు కాదు. అయితే అమ్మాయి బాగుండటంతో కావాలని అమిత్ కుటుంబం పెళ్లి ప్రపోజల్ పెట్టారు. ఇక స్వేచ్చ కుటుంబం కూడా అన్నీ ఆలోచించి అమిత్ అందంగా ఉన్నాడు ఆస్తి ఉంది, ఇక స్వేఛ్చ కూడా సుఖపడుతుంది అని వివాహం చేశారు.
అయితే వివాహం అయిన తర్వాత ఎన్నో ఆశలతో స్వేఛ్చ అత్తవారి ఇంట అడుగు పెట్టంది. అమిత్ మాత్రం శోభనం రోజున తనని దగ్గర చేసుకోలేదు.
అయితే కాస్త బిడియంగా ఉన్నాడు కుదురుకుంటాడు అనుకుంది. కాని రోజులు గడుస్తున్నారెండునెలలు దాటినా అతనిలో మార్పు లేదు. టచ్ చేస్తే పక్కకు వెళ్లిపోతున్నాడు. నీ ప్రాబ్లం ఏమిటి అని అడిగితే తాను గే అనే విషయం చెప్పాడు.
ఆ మాట విని స్వేఛ్చ షాక్ కి గురి అయింది. వెంటనే తన తల్లిదండ్రులకి అసలు విషయం చెప్పింది.
తమని మోసం చేసి నా కూతురు జీవితాన్ని నాశనం చేశారు అని పోలీసులకు ఫిర్యాదు చేశాడు స్వేఛ్చ తండ్రి.
అయితే అమిత్ పేరెంట్స్ కి ఈ విషయం తెలుసు
పెళ్లి చేస్తే అబ్బాయి మారతాడు అని తల్లిదండ్రులు భావించారు, కాని అతనికి వేరే అబ్బాయితో లవ్ ఉంది. ఈ విషయం తెలిసి స్వేచ్చ కన్నీరు మున్నీరు అయింది.
అతని ఫోన్లో ఆ అబ్బాయిలతో అమిత్ చనువుగా నగ్నంగా ఉన్న వీడియోలు ఫోటోలు సాక్ష్యంగా చూపించింది.. దీనిపై అమిత్ కుటుంబం డబ్బులు ఇచ్చి రాజీ చేసుకుందాం అని కోరుతోంది. కానీ స్వేచ్చ కుటుంబ సభ్యులు మాత్రం వీరిని జైలుకి పంపాలి అంటున్నారు .