ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏం చేసినా సంచలనమే అని చెప్పాలి. ఆయన విజన్ ఏ నాయకుడికి ఉండదు. అందరూ మరో 10 ఏళ్ల తర్వాత ఆలోచిస్తే ఆయన 25 ఏళ్లకు 30 ఏళ్లకు ప్రపంచం ఎలా ఉంటుందని ఆలోచిస్తారు. హైదరాబాద్ దీనికి ప్రత్యక్ష ఉదాహారణ.
ఆనాడు వందల ఉద్యోగాలు వస్తే ఇప్పుడు లక్షలాది ఉద్యోగాలకు కేంద్రం అయింది హైదరాబాద్. ఐటీఎగుమతుల్లో బెంగళూరుతో పోటి పడుతోంది ప్రస్తుతం హైదరాబాద్.
అయితే తాజాగా పేదరికాన్ని తగ్గించేందుకు ఏపీలో సీఎం చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 2029 నాటికి ఏపీలో పేదరికం లేకుండా చేయడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం.
ఉగాది వేళ ఆంధ్రప్రదేశ్‌లో పీ-4 జీరో పావర్టీ అనే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని చెప్పారు చంద్రబాబు. ఇక ఇప్పుడు కార్యరూపం దాల్చింది.
పీ-4 ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే? మన రాష్ట్రంలో అట్టడుగున ఉన్న పేదల సాధికారత కోసం దీనిని చేపడుతున్నారు. ముందు నాలుగు గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపడతారు.
ఆయా గ్రామాల్లో 5,869 ఫ్యామిలీలకు లబ్ధి చేకూరుతుంది. సంపద అధికంగా ఉన్న ఫ్యామిలీలు అట్టడుగున ఉన్న ఫ్యామిలీలకు సపోర్టుగా నిలబడటమే ఈ కార్యక్రమ ఉద్దేశం. దీనికి సంబంధించి పేదలు ఎవరు ఉన్నారు అనేది ఆయా పంచాయతీలు సచివాలయాలు పూర్తిగా సిబ్బంది డేటా ద్వారా గుర్తిస్తారు.
పీపుల్-పబ్లిక్-ప్రైవేట్-పార్టనర్ షిప్ — పీ-4 లో భాగం.. రానున్న నాలుగు సంవత్సరాల్లో 20 లక్షల కుటుంబాలని పేదరికం నుంచి బయటకు తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీ యజమానులు, కోట్ల రూపాయల టర్నోవర్ చేస్తున్న వ్యాపారులు, అపర కుబేరులు, ఆర్దికంగా బలంగా ఉన్న వారు, విదేశాల్లో ఉన్న ప్రవాసులు, అందరూ కూడా భాగస్వాములు అవ్వనున్నారు, వారి నుంచి కూడా మంచి స్పందన వస్తోంది.
ఇప్పటి వరకు ప్రభుత్వం బంగారు కుటుంబాలు, మార్గదర్శుల ఎంపిక ప్రక్రియ చేపట్టింది.దాదాపు 13 లక్షల బంగారు కుటుంబాలు గుర్తించారు. వారిని దత్తత తీసుకుని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చేలా వారికి 1.40 లక్షల మంది పారిశ్రామిక వేత్తలు, ప్రవాసాంధ్రులు ముందుకొచ్చారు.. వీరందరూ నమోదు చేసుకున్నారు. ఆ కుటుంబంలో వారికి ఉపాది కల్పించడం తోడ్పాటు అందించడం కూడా చేస్తారు.