ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ సేవలు మన దేశంలో ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అని అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా భారత ప్రత్యేక గుర్తింపు ప్రాధికార సంస్థ Starlink Satellite Communication Pvt Ltd ను ఆన్‌బోర్డ్ చేసింది.
ఇక కస్టమర్లకు ఆధార్ ఈ-అథెంటికేషన్ ద్వారా వెరిఫై చేయగలదు. మన దేశంలో మస్క్ కి సంబంధించి ఈ స్టార్ లింక్ సేవలకు లైసెన్స్ ఇచ్చారు.
ఇక కొన్ని విషయాలో టెస్టింగ్ దశలో ఉన్నాయి. త్వరలోనే స్టార్ లింక్ సేవలు ఇక మన దేశంలో స్టార్ట్ అవ్వనున్నాయి.. ఇక ఇంటర్నెట్ వేగం 25Mbps, 220Mbps మధ్య ఉంటుంది అంటున్నారు నిపుణులు
. ఇది మన మొబైల్ స్పీడ్ కంటే చాలా రెట్లు ఎక్కువ అనే చెప్పాలి. ఇప్పటికే IN-SPACe నుండి అవసరమైన లైసెన్స్‌లను స్టార్ లింక్ పొందింది.
అయితే దీని ఖరీదు గురించి కూడా చర్చ జరుగుతోంది. అమెరికాలో చాలా ఖరీదు ఉంది అక్కడ ఆదాయాల బట్టి అది సాధరణం.. అక్కడ నెలకి 8 వేల నుంచి ధర ఉంది.
మరి భారత్ లో చూసుకుంటే దాదాపు నెలకి 3 నుంచి 5 వేల మధ్య సేవలు ప్లాన్ బట్టి ఉండవచ్చు అంటున్నారు..ఇన్ స్టాలేషన్ చార్జ్ ల కింద దాదాపు 30 వేల వరకూ ధర ఉండవచ్చు అంటున్నారు. సో ఈ స్టార్ లింక్ సేవలు ప్రీమియం సేవలు అనే చెప్పుకోవాలి.
స్టార్‌లింక్ ఇప్పడు కనిపిస్తున్న కంపెనీల్లా ISP (Internet Service Provider) కాదు. ఇది ఫైబర్ ఆప్టిక్స్ — మొబైల్ టవర్స్‌పై ఆధారపడదు. ఇది పూర్తిగా శాటిలైట్ బేస్ సర్వీస్ అనే చెప్పాలి.
మన భూమి చుట్టూ 500–2000 కి.మీ ఎత్తులో తిరిగే చిన్న శాటిలైట్‌ల ద్వారా ఇది మనకు ఇంటర్ నెట్ అందిస్తుంది.
ఇక ఇంటికి ఆఫీసుకి ఇన్ స్టాల్ చేసే సమయంలో డిష్ యాంటెన్నా ఫిక్స్ చేస్తారు. దాని ద్వారా రౌటర్ నుంచి ఇంటర్నెట్ అందిస్తుంది.. చాలా దూర ప్రాంతాలు ముఖ్యంగా రిమోట్ విలేజెస్ కి కూడా సర్వీస్ చక్కగా అందుతుంది. చివరి మూడు నెల్లలో భారత్ లోకి అందుబాటులోకి రావచ్చు అంటున్నారు టెక్ నిపుణులు.