ఇటీవల చిత్ర పరిశ్రమలో చాలా మంది ప్రముఖులు దూరం అవుతున్నారు. కొందరు అనారోగ్యంతో మరణిస్తే, మరికొందరు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. వారి మరణం కుటుంబ సభ్యులనే కాదు వారిని అభిమానించే వారికి కూడా ఎంతో బాధ కలిగిస్తోంది.
తాజాగా మరాఠీ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది.
ప్రముఖ నటి జ్యోతి చందేకర్ అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. ఆమె వయసు ప్రస్తుతం 68 సంవత్సరాలు.
గత కొన్ని వారాలుగా జ్యోతి చందేకర్ ఆరోగ్యం బాగాలేకపోవడంతో, పూణెలోని దీనానాథ్ మంగేష్కర్ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ అందిస్తున్నారు.
అయితే పరిస్దితి విషమించడంతో ఆగస్టు 16 సాయంత్రం 4 గంటలకు ఆమె కన్నుమూశారు. ఆస్పత్రి వైద్యులు ఈ విషయాన్ని తెలియచేశారు. ఆమె మరణ వార్త విన్న సినీ కుటుంబం, ప్రముఖులు తీవ్ర విచారంలో ఉన్నారు. ఆమెకి నివాళి అర్పిస్తున్నారు
కుటుంబ సభ్యులు అంతిమ కార్యక్రమాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రముఖులు చివరిగా ఆమె భౌతికకాయానికి నివాళి అర్పిస్తున్నారు. టెలివిజన్, రంగస్ధలం, సినిమాలు ఇలా మూడు చోట్ల ఆమె అలరించారు.
జ్యోతి చందేకర్ నటించిన సినిమాలు సీరియల్స్ చూస్తే ధోల్కీ, తిచా ఉంబర్తా. మీ సింధుతాయ్ సప్కాల్ ఈ సినిమాల్లో మంచి పేరు వచ్చింది. అలాగే బుల్లితెర సీరియల్స్ చూస్తే.
ఛత్రీవాలీ, తూ సౌభాగ్యవతి హో వంటి సీరియల్స్ మరింత పేరు తీసుకువచ్చాయి. చందేకర్ కూతురు తేజస్వినీ పండిట్ హీరోయిన్‌గా రాణిస్తున్నారు.
వీరిద్దరు కలిసి తిచా ఉంబర్తా సినిమాలో నటించారు. ఈ సినిమాకి జీ గౌరవ్ అవార్డు వచ్చింది. అలాగే ఇండస్ట్రీకి ఆమె చేసిన సేవలకుగాను చిత్ర పరిశ్రమ నుంచి బాలగంధర్వ జీవత సాఫల్య పురస్కారం కూడా అందుకున్నారు.