Trump Tariff War : చైనాపై 125% పెంపు, ఇతరులకు 90 రోజుల విరామం

  • News
  • April 10, 2025
  • 0 Comments

ప్రపంచ మార్కెట్లు కుప్పకూలుతున్న వేళ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.
పలు దేశాలపై విధించిన టారిఫ్‌లను 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, చైనాకు మాత్రం టారిఫ్ రేటును ఏకంగా 125%కి పెంచారు.

ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ ద్వారా మరింత ఘాటుగా మాట్లాడారు.
“ప్రపంచ మార్కెట్ల పట్ల చైనా చూపుతున్న నిర్లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని, అమెరికా చైనాపై విధిస్తున్న టారిఫ్‌ను ఏకంగా 125%కి పెంచారు . ఇది తక్షణమే అమల్లోకి వస్తుంది. ” అని ఆయన పేర్కొన్నారు

ఈ ప్రకటన వెలువడగానే ప్రపంచ మార్కెట్లు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాయి.
S&P 500 సూచిక దాదాపు 7% పెరిగింది. అయితే, చైనా మినహా ఇతర దేశాలపై టారిఫ్ తగ్గింపుల గురించిన పూర్తి వివరాలు మాత్రం ఇంకా చెప్పా లేదు.
.

ఇంతకుముందు ట్రంప్ చేసిన టారిఫ్ పెంపుదల లో , “75కి పైగా దేశాలు అమెరికాతో చర్చలు జరపడానికి సంప్రదించాయి. ఈ దేశాలు ఎలాంటి ప్రతీకార చర్యలు తీసుకోలేదు.

Also Read  ప్రియుడు మరియు కాంట్రాక్ట్ కిల్లర్ సహాయంతో భర్తను చంపిన యూపీ మహిళ.

కావున వారికి 90 రోజుల విరామం ఇవ్వడానికి మరియు 10% తగ్గిన పరస్పర టారిఫ్‌ను అమలు చేయడానికి అనుమతి ఇచ్చం.” అని తెలిపారు.
ఈ 10% టారిఫ్ పోయిన శనివారం నుండి కొత్తగా అమల్లోకి వచ్చింది. ఇది యూరోపియన్ యూనియన్‌పై ఉన్న 20%, జపాన్‌పై ఉన్న 24% మరియు దక్షిణ కొరియాపై ఉన్న 25% టారిఫ్‌లతో పోలిస్తే తక్కువే అయినప్పటికీ, గతంలో అమెరికా విధించిన టారిఫ్‌లతో పోలిస్తే ఇది పెరుగుదలే.

ట్రంప్ చర్యలకు ప్రతిగా చైనా బుధవారం అమెరికా సరుకులపై 84% టారిఫ్‌లు పెంచింది.

ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల(USA And China ) మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదిరేలా ఈ చర్యలు ఉన్నాయి.

ట్రంప్ విధించిన “Reciprocal” టారిఫ్‌లు అదే రోజు అమల్లోకి వచ్చాయి, వీటిలో చైనా తీవ్రంగా నష్టపోయింది.

కెనడా కూడా అమెరికా విధించిన 25% ఆటో టారిఫ్‌లను అనుసరించింది.

అమెరికా స్టీల్ మరియు అల్యూమినియంపై 25% టారిఫ్‌లు విధించడంతో యూరోపియన్ యూనియన్ కూడా అమెరికా సరుకులపై కొత్త పన్నులు విధించింది.

Also Read  టాలీవుడ్ స్టార్స్ ప్రభాస్, బాలకృష్ణ, గోపీచంద్‌పై అక్రమ బెట్టింగ్ యాప్ కేసు.

అమెరికా మరింత టారిఫ్‌లకు పాల్పడితే “మేము చివరి వరకు పోరాడతాం” అని చైనా ఇదివరకే చెప్పడం జరిగింది.

మధ్యరాత్రి నుంచే ట్రంప్ విధించిన టారిఫ్‌లు అమల్లోకి వచ్చాయి:

చైనాపై 104%, యూరోప్‌పై 20%, జపాన్‌పై 24% మరియు దక్షిణ కొరియాపై 25%. చర్చల ద్వారా ఈ రేట్లు తగ్గవచ్చని ట్రంప్ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, అది జరగడానికి నెలల సమయం పట్టవచ్చని అధికారులు అంటున్నారు.

Related Posts

  • News
  • April 13, 2025
  • 23 views
Reciprocal Tariffs: పరస్పర సుంకాలును తగ్గించిన ట్రంప్.

యూఎస్ఏ ప్రెసిడెంట్ అయినటువంటి డోనాల్డ్ ట్రంప్ చాలా రోజుల నుంచి ప్రపంచవ్యాప్తంగా “Reciprocal Tariff” పెంచడం జరిగింది. కొన్ని వస్తువులైనటువంటి స్మార్ట్ ఫోన్స్ ,లాప్టాప్స్, చిప్స్ వీటన్నిటి మీద ఎటువంటి పాత విదానం ద్వారా Import & Export ఉండనున్నాయి. పలు…

Read more

  • News
  • April 11, 2025
  • 32 views
Break -UP: ప్రతీకారాన్నిపార్సిల్ రూపంలో బయటపెట్టిన ప్రియుడు.

పశ్చిమ బెంగాల్‌కు చెందిన 25 ఏళ్ల యువకుడు, తన మాజీ Girl friend పై ప్రతీకారం తీర్చు కోవాడానికి, అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్‌ల ద్వారా దాదాపు 300 (COD) పార్సిళ్లను ఆమె నివాసానికి పంపాడు. బ్రేకప్ తర్వాత ‘ప్రతీకారం’ తీసుకోవాలని భావించిన…

Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *